చక్కరొచ్చిన జగన్‌

ఆస్పత్రికి తరలించిన పోలీసులు
హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా, సీమాంధ్ర పక్షం వహిస్తూ చంచల్‌గూడ జైళ్లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ గురువారం చక్కరొచ్చి పడిపోయాడు. ఐదు రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆయన రక్తంలో గ్లూకోజ్‌ శాతం పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా వుంచాలన్న డిమాండ్‌తో చంచల్‌గూడ జైలులో అమరణదీక్ష చేస్తునన్నాడు. అయితే జగన్‌ కిందపడిపోయేడనే వార్తలను జైలు అధికారులు ఖండించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జగన్‌ దీక్షను భగ్నం చేసిన జైలు అధికారులు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో అతడిని నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయుధలైన పోలీసులతో పహారా కాయిస్తున్నారు.