సీఎం కిరణ్‌ను కాంగ్రెస్ వెంటనే బర్తరఫ్ చేయాలి : హరీష్‌రావు
వరంగల్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటుదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేత టి. హరీష్‌రావు హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక్క నిమిషం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని హరీష్ మండిపడ్డారు. హైకమాండ్‌ను దిక్కరించేలా మాట్లాడుతున్న కిరణ్ వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం బర్తరఫ్ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. కిరణకుమార్‌రెడ్డి న్యాయకత్వంలో కాంగ్రెస్ 52 ఉప ఎన్నికలు జరిగితే 50 స్థానాల్లో ఓడిపోయిన విషయం గుర్తు చేశారు.