నేడే వీండీస్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ రెండో వన్డే

బెంగుళూరు: తొలి మ్యాచ్‌లో ఘనంగా విజయం సాధించడంతో బ్యాట్స్‌ మ్యాన్ల్‌లు , బౌలర్లు వూపు మీద ఉన్నారు. ఈ నేపధ్యంలో సిరీస్‌ విజయమే లక్ష్యంగా భారత ‘ఎ’ జట్టు వెస్టీండీస్‌ ‘ఎ’తో మంగళవారం రెండో అనధికార వన్డేతో తలపడనుంది. కెప్టెన్‌ యువరాజ్‌, యూసుఫ్‌ మరోసారి విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదు.ఈ వన్డేలోనే గెలిచి సీరీస్‌ సోంతం భారత్‌ చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి మూడు వన్డేల సీీరీస్‌ ను 1-1తో సమం చేయాలని విండీస్‌ భావిస్తోంది. వీండీస్‌ కీలక ఆటగాళ్లు కిర్క్‌ ఎడ్వర్డ్స్‌, రస్కెల్‌, డియోనారాయణ్‌, ఎడ్వర్డ్స్‌ ఎలా రాణిస్తారన్న దాని మీదే విండీస్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.