వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్య

జగిత్యాల వ్యవసాయం : కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలం పొలాసలోని వ్యవసాయ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న మంజుల శనివారం రాత్రి వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంజుల స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా కడెం మండలంలోని రావోజీపేట. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.జగిత్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.