జగన్ హైదరాబాద్‌లో సభ పెడితే మానుకోట రాళ్లకు పనిచెబుతాం : ఈటెల
వరంగల్ : హైదరాబాద్‌లో వైఎస్ జగన్ సభ పెడితే మానుకోట రాళ్లకు పనిచెప్పాల్సి వస్తదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వైఎస్ జగన్‌ను హెచ్చరించారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకుంటే ఆంధ్రా అభివృద్దిని అడ్డుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులకు దసరా లోపు 25 శాతం లాభాల్లోని వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.