బాబు దీక్ష కోసం వేసిన కమిటీ కుట్ర కమిటీ
వరంగల్ : చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తాననడంపై టీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. బాబు దీక్షపై వేసిన కమిటీ వ్యూహాత్మక కమిటీ కాదని , కుట్రల కమిటి అని పేర్కొన్నారు. ఎర్రబెల్లి ,రేవూరి ఆ కుట్రలకు బాధ్యులని దుయ్యబట్టారు. హైదరాబాద్‌పై మెలిక పెట్టేందుకే బాబు ఢిల్లీలో దీక్ష అంటున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రకటన అనంతరం అన్ని పార్టీల రాజకీయ రంగు బయటపడిందని పేర్కొన్నారు.