కటక్ వన్డేలో ప్రారంభమైన టికెట్ల విక్రయాలు
కటక్ : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగనున్న ఐదో వన్డేకు ఒడిశాలోని కటక్ బారాబటి స్టేడియం సిద్దమైంది మ్యాచ్ టికెట్ల విక్రయాలను ఆదివారం ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న క్రీడాసంఘాలు ,క్లబ్బుల ప్రతినిధులు ఓసీఏ కాన్పరెన్స్ హాల్‌కి చేరుకుని టికెట్లు కొనుగోలు చేశారు. 13వేలకు పైగా టికెట్లు క్రీడాసంఘాలకు కేటాయించామని ఓసీఏ వర్గాలు తెలిపాయి.మరోవైపు మైదానంలో ఆదివారం నుంచి భద్రత చర్యలు పెంచారు. స్టేడియం వద్ద సాయుధ పోలీసులను నియమించారు. ఏర్పాట్లపై ఓసీఏ కార్యాలయంలో సమావేశాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.