సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో దొంగల బీభత్సం
వరంగల్ : జిల్లాలోని నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం పగులగొట్టిన దుండగులు ఫైళ్లు చింపివేసి పరారయ్యారు. ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.