వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవం
వరంగల్ : వరంగల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అరెస్టుల మధ్య సాగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ కాన్వాయ్‌ను తెలంగాణ జాగృతి విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు , విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.