భారీ స్కోరు దిశగా భారత్‌

ముంబయి : భారత్‌,విండీస్‌ మధ్య జరుగుతున్న ముంబయి టెస్ట్‌ మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. సచిన్‌ 67, పుజారా 49 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 203. అభిమానులు మాత్రం సచిన్‌ సెంచరీ కోసం ఎదురు చూస్తున్నారు.