ఎమ్మెల్యే కుమారుని వివాహ వేడుల్లో పాల్గొన్న కేసీఆర్
వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య కుమారుని వివాహ వేడుకల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. సోమవారం వరంగల్‌లోని కాజీపేట ఫాతిమా క్యాధెపూడల్ చర్చిలో ,అనంతరం సీఎస్సార్ గార్డెన్‌లో నిర్వహించిన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు ,మంత్రులు బస్వరాజు సారయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్,ఉపనేత హరీష్‌రావు, ప్రభుత్వ ఛీప్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపీ రాజయ్య, ఎమ్మెల్యే కేటీఆర్, దాస్యం వినయ్‌భాస్కర్, కడియం శ్రీహరి , పేర్వారం రాములు, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి ,కల్వకుంట్ల కవిత ,బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.