అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం
వరంగల్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ముందుకొచ్చాడు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాను పుట్టిన రోజు జరుపుకోకుండా తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని భావించాడు. హన్మకొండకు చెందిన మీస నిఖల్ తన 17 వ పుట్టిన రోజు సందర్భంగా రూ. 3 వేలను ‘నమస్తే తెలంగాణ’ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ సొసైటీకి అందజేశారు.