ఇల్లందులో అత్యవసరంగా దిగిన సైనిక హెలికాప్టర్
ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందులో సైనిక విభాగానికి చెందిన హెలికాప్టర్ 24ఏరియా స్టేడియంలో అత్యవసరంగా దిగింది. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండైనట్లు కెప్టెన్ దూబే తెలిపారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని పైలెట్ తెలిపారు. ఈ సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మరమ్మతులు సమయంలో హైదరాబాద్ నుంచి ఇంజినీర్లతో మరో హెలికాప్టర్ ఇల్లందు బయలు దేరింది.