అవినీతి అంతమే మా పంతం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 21 (జనంసాక్షి) :
అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తానమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ప్రజల అభిప్రాయం గ్రహించగలిగే ముందుచూపు అవసరమని ప్రజల ఆశయాలకు అనగుణంగా నడుచుకుని సమర్థ పాలన అందించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. అన్ని రంగాల్లో నిర్ణీత సమయంలోగా పారదర్శకత తీసుకురావాలని కోరారు. ప్రాజెక్టులు పూర్తిచేసే విషయంలో జాప్యం సహించకూడదని అన్నారు. ఇవాళ దేశంలో అవినీతి అనేది ప్రధాన అంశంగా మారిందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడంలో ఆలస్యం చేయకూడదని సూచించారు. అందుకే లోక్‌పాల్ బిల్లు తీసుకుని వచ్చామని అన్నారు. దీనిద్వారా అవినీతి నిర్మూలనకు మార్గం సుగమమయ్యిందన్నారు. కాంగ్రెస్ అనేక చర్యలు తసీఉకుని ముందుకు పోతున్నదని అన్నారు. లోక్‌పాల్ బిల్లుపై తీసుకున్న చొరవ కారణంగా ప్రజల ఆకాంక్ష నెరవేర్చగలిగామన్నారు.