ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ యత్నాలు

హైదరాబాద్‌: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ప్రభావం చూపగలిగిందని భాజపా
సీనియర్‌ నేత ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…జనాకర్షక పథకాలు కూడా కాంగ్రెస్‌ను కాపాడుకోలేక పోయాయన్నారు. కొత్తగా ప్రారంభించిన ఆధార్‌ జనాధార్‌ను పెంచలేక నిరాధారంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు జనాకర్షక పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని వెంకయ్యనాయుడు విమర్శించారు.