వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్బంగా భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో రోగులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. దేశం గర్వించదగ్గ ప్రధానిగా వాజ్‌పేయి కొనసాగారని ఆయన అభివర్ణించారు.