పంచాయతీ సెక్రటరీ పరీక్షకు ఉచిత శిక్షణ
వరంగల్,జనవరి24: పంచాయతీ సెక్రటరీ విఎవో, విఆర్వో పరీక్షకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీబీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పొందాలనుకునే వారు తమ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. అభ్యర్థులు పంచాయతీ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఉండాలన్నారు. . అందుకు సంబందించిన జిరాక్స్ ప్రతిని జతచేయాలి. అభ్యర్థి అర్హత ఒరిజినల్ టీసీ తప్పకుండా సమర్పించాలి. కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయలు మించరాదని, జిల్లాకు చెందిన అభ్యర్థులై ఉండాలని సూచించారు. ఇవన్నీ ఉంటే తమను సంప్రదించాన్నారు.