ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల ఫైనల్‌ నేడే

మెల్‌బోర్న్‌ : సంచలనం వావ్రింకా మరో షాకిస్తాడా లేదా జోరుమీదున్న నాదల్‌ మరో టైటిల్‌ చేజిక్కించుకుంటాడా? విజేత ఎవరైనా ఆసక్తికర పోరు మాత్రం భాయం! ఫామ్‌లో ఉన్న ఇద్దరి మధ్య ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌ నేడే. వావ్రింకా (స్విట్జర్లాండ్‌) క్వార్టర్‌ ఫైనల్లో జకోవిచ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. అతడు తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కోసం ఉవ్విళ్లూరుతుండగా ప్రపంచ నెంబర్‌వన్‌ నాదల్‌ (స్పెయిన్‌)14వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గి ఫెదరర్‌ రికార్డుకు మరింత చేరువ కావాలను కుంటున్నాడు.