75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా

కరీంనగర్ తెలంగాణా చౌక్ లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ కుమార్, గంగుల, జిల్లా యంత్రాంగం, విద్యార్థులు, ప్రజలు

 

75వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ నగరంలోని తెలంగాణా చౌక్ లో మంగళవారం జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు సహా పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు జిల్లా యంత్రాంగం, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ, సుడా ఛైర్మన్ జీ.వీ రావు, మాజీ ఎమ్మెల్సి నారదాసు లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ కర్ణన్, పోలీసు కమిషనర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.