ఏసీబీ ప్రభుత్వ ఆదేశాలతో కాదు

-కోర్టు పరిధిలో పనిచేయాలి
‘లిక్కర్‌’ ప్రజాప్రతినిధులపై చర్యలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏసీబీ ఇకనుంచి ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా కోర్టు పరిధిలో పనిచేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాదేశాలమేరకు కాకుండా చట్టబద్ధంగా న్యాయస్థానం ఆదేశాలతో పనిచేయాలని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై ఏసీబీ ప్రత్యక్షంగా చర్చలు తీసుకోవద్దన్న మెమోపై ఈ రోజు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రాధమిక ఆధారాలుంటే కేసు నమోదు చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది.ఈ అంశంపై న్యాయస్థానం రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేననిహైకోర్టు చెప్పింది. లిక్కర్‌ సిండికేేట్‌ కేసులో ప్రజా ప్రతినిధుల ప్రాసిక్యూషన్‌ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.