రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఘనవిజయం ఖాయం

సోనియావల్లే తెలంగాణ
100 అసెంబ్లీ, 15 ఎంపీలు గెలుస్తాం : డి.కె.అరుణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
తెలంగాణా రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు ఖాయమని మాజీ మంత్రి డికె అరుణ తెలిపారు. న్యూఢిల్లీలో మీడియాతో మంగళవారం మాట్లాడారు. సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిం దేనన్నారు. తాము కూడా గడపగడపకు వెళ్లి సోనియా వైభవాన్ని చాటనున్నట్టు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు.. లోక్‌సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలిపిస్తామన్నారు. టిఆర్‌ఎస్‌ విలీనంపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. లేనిపోనివి చెబుతూ కాలయాపన చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీనం కావడం ఖాయమన్నారు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. నిర్ణీత కాలవ్యవధిలోనే ఎన్నికలు రానున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌ పడబోవని చెప్పారు.
తోమ్మిదెండ్లు ఎలగవెడితివి గదా!
గప్పుడెందుకు చెయలే?