రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
రఘునాథ్‌పల్లి:హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిలోని రఘునాధ్‌పల్లి బస్టాండ్ సమీపంలో సుమో వాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసీఆర్ స్వాగతం పలికేందుకు హైదరాబాద్ వెళ్తున్న కొంతమంది కార్యకర్తలతో బయల్దేరిన సుమో రోడ్డు దాటుతున్న ప్రకాశం జిల్లా కొండాయపల్లి గ్రామానికి చెందిన రావెళ్ల వెంకటేశ్వర్లు (32)ను ఢీకొట్టింది.దీంతో తీవ్రగాయాలపాలైన వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. సుమోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.