రాష్ట్రపతి పాలనవైపు మొగ్గు
నేడు కేబినెట్‌లో నిర్ణయం
మేడం గ్రీన్ సిగ్నల్
నాలుగు దశాబ్దాల తర్వాత ప్రెసిడెంట్ రూల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వైపు కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆమె ఆమోదం మేరకే కేబినెట్ రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ ముఖమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తరువాత రాష్ట్ర పాలన సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తొలుత భావించినా తాజాగా రాష్ట్రపతి పాలన విధించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర ¬ం మంత్రి షిండే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వీరు చర్చించినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు నెలల కోసం కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం మంచిందని కొంతమంది పెద్దలు అధిష్టానానికి సూచిస్తున్నట్లు సమాచారం. ¬ం శాఖ అధికారులు కూడా ఓ నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. .కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యాక ఇవే అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తరువాత రాష్ట్రంలో పాలన సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనితో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు అధిష్టానం లీకులు ఇచ్చింది. అంతేగాక రాష్ట్రంలోని కొంతమంది ముఖ్యమైన నేతలతో దీనిపై చర్చలు చేపట్టింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందులో సీఎంగా చిరంజీవిని నియమిస్తారని పుకార్లు షికార్లు చేశాయి. తమకూ పదవులను కట్టబెట్టాలని పలువురు నేతలు హస్తినకు బయలుదేరి పెద్దలకు విన్నవించుకున్నారు. తాజాగా రాష్ట్రపతి పాలన విధిస్తారన్న లీకులు రావడంతో పదవిపై ఆశలు పెట్టుకున్న వారందరూ నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం. చిరంజీవి కూడా హైదరాబాద్‌కు చేరుకుని అనవసరంగా మీడియా ఈ విషయంలో అత్యుత్సాహం చూపిందన్నారు. మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా ? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. శుక్రవారం జరిగే కేబినేట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.