ఆదివాసీలను ముంచేందుకే పోలవరం
మందకృష్ణ ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) :
ఆదివాసీలను ముంచేందుకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహించారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, తెలంగాణ జేఏసీ మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు ఆదివాసీలను సీమాంధ్రలో వదిలి వేయడంలో కాంగ్రెస్‌తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పోలవరం కోసం గిరిజనులను బలిచేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ర్ను చరిత్ర క్షమించదని మందకృష్ణ మండిపడ్డారు. ఆదివాసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపిస్తూ మందకృష్ణ మాదిగ గురువారం ట్యాంక్‌బండ్ వద్ద కొమరంభీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గిరిజనలకు అండగా తాము పోరాడుతున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం లక్ష్యంగా తమ పోరు సాగుతూనే ఉంటుందన్నారు.