గుజరాత్ అల్లర్లపై
హై కోర్టు తలుపుతట్టిన జకియా జాఫ్రి
అహ్మదాబాద్, మార్చి 18 (జనంసాక్షి) :
గుజరాత్‌లో 2002 గోద్రా ఊచకోతలపై బాధితు రాలు జకియా జాఫ్రి హైకోర్టును ఆశ్రయించారు. గోద్రా దారుణ మారణకాండపై విచారణ జరిపిన సి ట్ ఈ ఘటనలతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సంబంధం లేదంటూ క్లీన్‌చీట్ ఇచ్చింది. సు ప్రీం కోర్టు గోద్రా మారణకాండపై నియమించిన దర్యాప్తు సంస్థ సిట్ మోడీకి క్లీన్ చీట్ ఇవ్వడంపై జకియా జాఫ్రి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె భర్త, స్థానిక ఎంపీ అయిన జాఫ్రీని గోద్రా అల్లర్లలో సజీవ దహనం చేశారు. మూడు వేల మందికిపైగా ఊచకోతలకు గురైన ఈ అల్లర్లు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే దర్యాప్తు సంస్థలు పూర్తిస్థాయిలో విచారణ జరుపకుండా కొందరి ప్రభావానికి గురయ్యాయని జకియా జాఫ్రి గతంలోనే పేర్కొన్నారు. మోడీకి సిట్ క్లీన్ చీట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జకియా జాఫ్రి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.