ప్రముఖ జర్నలిస్టు కుశ్వంత్‌సింగ్‌ కన్నుమూత

కుటుంబ సభ్యులకు ప్రధాని, సోనియా పరామర్శ

పలువురి ఘన నివాళి

న్యూఢిల్లీ, మార్చి 20

(జనంసాక్షి) :

ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుశ్వంత్‌సింగ్‌ (99) కన్నుమూశారు. ఆయన కొంతకా లంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన బంధువులు తెలిపారు. 1915, ఫిబ్ర వరి 2వ తేదీన ఆయన పాకిస్తాన్‌ (ప్రస్తుతం) లోని హదా లిలో జన్మించారు. స్వాతంత్య్రో ద్యమ కాలం నుంచి జర్నలి స్టుగా పనిచేస్తు న్నారు. ఒకవైపు రచయితగా మరోవైపు జర్న లిస్టుగా కీలక బాధ్య తలు నిర్వర్తించారు. 1974లో పద్మభూషణ్‌, 20 07లో పద్మవి భూషణ్‌, 2010లో సాహిత్య అకాడమి ఫెలో షిప్‌ అవార్డు అందుకున్నారు. ప్రధాని మన్మో హన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోని యాగాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తదితర ప్రముఖులు ఆయన నివాసానికి చేరు కొని ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యు లను పరామర్శించారు. కుష్వంత్‌సింగ్‌ తండ్రి శోభాసింగ్‌ లూట్యెన్స్‌ ఢిల్లీ కాలనీని నిర్మించిన బిల్డర్లలో ఒకరు. ఢిల్లీతో తనకున్న అనుబం ధాన్ని కుష్వంత్‌ రచనల్లో తరచూ ప్రస్తావించే వారు. ఆయన రాసిన ఢిల్లీ నవలలో రాజధానితో తన అనుబం ధాన్ని వివరించారు. ట్రైన్‌ టు పాకిస్థాన్‌ సాహితీ రంగంలో ఆయనకు విశిష్ట స్థానాన్ని తెచ్చిపెట్టింది. వ్యంగ రచనలతో అందరినీ నవ్వించే కుష్వంత్‌ సంటా బంటా జోడిపై రాసిన జోకులు ఆదరణ పొందాయి. వార్ధక్యంతో బాధప డుతున్నా కుష్వంత్‌ ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు, పుస్తకాలు చదివే వారని ఆయన కుమారుడు రాహుల్‌సింగ్‌ చెప్పారు. గురువా రం ఉదయం కూడా దినపత్రిక చదివారని, పది రోజుల క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ గురించి అడిగారని ఆయన వివరించారు.