మోడీ భద్రతకు ఢోకా లేదు
హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే
ముంబై, మార్చి 23 (జనంసాక్షి) :
బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ బ óద్ర తకు ఎలాంటి ము ప్పు లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. పాట్నా పేలుళ్ల తర్వాత మోడీకి భద్రత పెంచామని ఆయన తెలిపారు. ఆదివారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ సహా బీజేపీ నేతలకు ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తనను కలిసిన ఆ పార్టీ ప్రతినిధులకు ఆయన తెలిపారు. బీజేపీనే కాకుండా ఉగ్రవాద ముప్పు ఉన్న అన్ని పార్టీల నేతలకు పటిష్ట భద్రత కల్పించామని అన్నారు. రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం శుక్రవారం షిండేను కలిసి భద్రతపై చర్చించిన నేపథ్యంలో షిండే స్పందించి ప్రముఖుల భద్రతపై తీసుకుంటున్న చర్యలను వివరించారు.