గత ప్రభుత్వాల కంటే మేమే మెరుగు
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం
ప్రధాని మన్మోహన్‌సింగ్
దిస్పూర్, మార్చి 29 (జనంసాక్షి) :దేశాన్ని పాలిం చిన గత ప్రభుత్వాలకంటే తమదే మెరుగైన పాలన అని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. యూపీఏ-1, యూ పీఏ-2 ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని తెలిపారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 2 ప్రభు త్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేసేం దుకు ప్రయత్నించిందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. దాదాపు అన్ని హామీలను నెరవేర్చి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. ఆయన శనివారం అస్సోంలోని శివసాగర్‌లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. అనేక రంగాల్లో తాము విజయం సాధించామని, కానీ కొన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయామని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకంటే అనేక రంగాల్లో తమ ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన పాలన అందించేందుకు కృషి చేశామన్నారు. ఆర్థికంగా కొంత వెనకబడ్డా అంతర్జాతీయ పరిసక్తితుల కారణంగా రాజీపడక తప్పలేదన్నారు. అయితే పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి ముందుకు తీసుకుని వెల్లామన్నారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నామన్నారు.