మోడీని ఓడిస్తా.. రాహుల్‌ను ఇంటికి పంపుతా : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) :
నరేంద్రమోడీని ఓడిస్తానని, రాహుల్‌గాంధీని ఇంటికి పంపుతానని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీ వాల్‌ తేల్చిచెప్పారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని మట్టికరిపిస్తానని కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేస్తారు. తాను ఎంపీ కావాలనుకుంటే సేఫ్‌ ప్లేస్‌ చూసు కునే వాడినని అయితే తనకు అలాంటి ఆలోచన లేదన్నా రు. మోడీని ఓడించడమే తన ధ్యేయమన్నారు. అయితే బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలను కేజీవ్రాల్‌ ఖండిం చారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశా రు. తూర్పు ఢిల్లీలో ఆప్‌ అభ్యర్థి రాజ్‌మోహన్‌గాంధీ ప్రచార కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను తూ ర్పారపట్టారు. ఒకవేళ పార్లమెంట్‌లో అడుగుపెట్టే ఉద ే్దశం ఉంటే సులభంగా గెలిచే సీటును ఎంచుకుని పోటీ చేసే వాడినని ఆయన అన్నారు. కేవలం మోడీని ఓడిం చాలనే కోరికతోనే వారణాసి నుంచి పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. అలాగే రాహుల్‌గాంధీని ఓడించ డానికి అమేథిలో కుమార్‌ విశ్వాస్‌ను బరిలోకి దించామని ఆయన అన్నారు. మోడీ,
రాహుల్‌ గాంధీలిద్దరూ ఓడిపోవాల్సిందే అని కేజీవ్రాల్‌ అన్నారు. ఇదిలావుంటే వారణాసికి చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకుడు దయాశంకర్‌ మిశ్రా దయాలు భాజపాలో చేరనున్నారు. ఈ మేరకు యూపీ భాజపా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జి అమిత్‌ షా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. దయాలు 2007, 2012 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు.