మా మేనిఫెస్టో కాపీ కొట్టారు
మేమిప్పటికే చేసినవి ప్రస్తావించారు
మహిళల రక్షణ హాస్యాస్పదం
భాజపా ఎన్నికల ప్రణాళికపై రాహుల్ ఫైర్
లాతూర్, ఏప్రిల్14 (జనంసాక్షి) :
తమ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. మహారాష్ట్రలోని లాతూ ర్‌లో రాహుల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభలో ప్రసంగిస్తూ కార్పోరే ట్ ప్రయోజనాల కోసమే అగ్ర నేత అద్వా నీని బీజేపీ పక్కన పెట్టిందని ఆరోపిం చారు. వీరికి సామాన్యుల ఆకాంక్షలు పట్ట వన్నారు. గుజరాత్‌లో రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అక్కడి రైతులే తన కు చెబుతున్నారని
అన్నారు. ఎన్నో చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. దీనికి సమాధానం చెప్పాలన్నారు. అనంతరం ఆయన ఒడిషా చేరుకున్నారు. ఒడిశాలో నవీన్‌పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజూజనతాదళ్ ప్రభుత్వాన్ని సాగనంపాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో ప్రచార సభలో మాట్లాడారు. ఒడిశాకు యూపీఏ ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయిందన్నారు. ఆ నిధుల అభివృద్ధి ఫలితాలు ప్రజలకు చేరలేదని ఆరోపించారు. ఒడిశాలో అపారమైన ఖనిజ వనరులున్నాయని, యూపీఏ ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పాలని యోచిస్తుందన్నారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని తెలిపారు. ఈ రోజుల్లో ‘మేడ్ ఇన్ చైనా అనే మాట తరుచూ వింటున్నామని మరి ‘భారత్‌లో తయారైంది’ అనే మాట ఎప్పుడు వింటామని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి నవీన్ ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని పారదోలాలన్నారు. రాహుల్ సభలకు భారీగా జనం తరలివచ్చారు.