కాంగ్రెస్‌కు పూర్వ వైభవం


మేం బలహీన పడ్డామన్నది
గోబెల్స్‌ ప్రచారం
రఘువీరా, చిరంజీవి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) :
సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని, తాము బలహీనపడ్డామనేది గోబెల్స్‌ ప్రచారమేనని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ చిరంజీవి అన్నారు. కాంగ్రెస్‌ టికెట్ల కోసం ఉన్న పోటీయే ఇందుకు నిదర్శనమని రఘువీరారెడ్డి అన్నారు. దాదాపు 1600 మంది టిక్కె ట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. గతంలో ఎప్పుడు ఇంతలా దరఖా స్తులు రాలేదన్నారు. సీమాంధ్రలో ఆంధప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మంగళవా రం ఉదయం బి.ఫారాలు అందజేశారు. పార్టీ గెలిచే విధంగా పనిచేస్తామంటూ అభ్య ర్ధులచే రఘువీరా రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల్లో అవలంబించాల్సిన తీరుపై అభ్య ర్ధులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకే అభ్యర్థు లకు టిక్కెట్లు ఇచ్చామని రఘువీరా అన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తారన్న ఆశాభావాన్ని జాతీయ నేత వయలార్‌ రవి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల పరి శీలకుడు వయలార్‌ రవి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ చిరం జీవి తదితరులు అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా రఘువీరా మట్లాడుతూ ప్రతి బి-ఫారమ్‌లో డమ్మీ అభ్యర్థి పేరుకూడా ఉంటుందన్నారు. ప్రతి అభ్యర్థికి డమ్మీ అభ్యర్థి కూడా ఉంటాడన్నారు. ఇందిరాభవవన్‌లో ఆంధప్రదేశ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు మంగళవారం ఉదయం బీఫాంల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి తదితరులు హాజరయ్యారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ క్లిష్ట పరిస్థితుల్లో లేదని కాంగ్రెస్‌ పూర్వవైభవం వస్తుందని ఏపీ ప్రచార కమిటీ చైర్మన్‌ చిరంజీవి అన్నారు. టికెట్ల కోసం నేతల పోటీ చూసి ఆశ్చర్యపోయామని తెలిపారు. కాంగ్రెస్‌ అంతా ఒకే సామాజిక వర్గమన్న భావన పోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్సే అన్న భావనను ప్రజల్లో పోగొట్టాలని నేతలకు సీమాంధ్ర ప్రచార సారథి చిరంజీవి పిలుపునిచ్చారు. విభజనన వల్లే సీమాంధ్రకు పోలవరం వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలే ఆక్సిజన్‌ పార్టీని బతికించుకుందామని చిరంజీవి పిలుపునిచ్చారు. అభ్యర్థులు దొరకరేమోనని ఆందోళనపడ్డామని, వందలాది మంది పోటీ పడ్డారని వివరించారు. అభ్యర్థులు గెలవలేమన్న నిస్పృహతో ఉన్నది వాస్తవమే అని అంగీకరించారు. అయితే కాంగ్రెస్‌ గెలుపు ముళ్లపై నడకలాంటిదని చిరంజీవి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో టిక్కెట్ల కోసం నేతల పోటీ చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేసిందని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో లేదన్నారు. అలాంటి వాదన సరికాదన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం తప్పనిసరిగా వస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీనవర్గాలకు ఎంతో చేసిందన్నారు. రాష్ట్రం విడిపోకుంటే పోలవరం ప్రాజెక్టును తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రానివ్వక పోయే వారన్నారు.