మాట ఇచ్చాం.. తెలంగాణ సాకారం చేశాం


తెలంగాణ డిమాండ్‌ నా వద్దకు వచ్చినపుడు టీఆర్‌ఎస్‌ పుట్టలేదు
బిల్లు తయారు చేశాం.. పార్లమెంట్‌లో ఆమోదించాంశ్రీఇందులో టీఆర్‌ఎస్‌ పాత్రలేదు
భాజపా, టీడీపీ, వైకాపా అడుగడుగునా అడ్డుకున్నాయి
భారీ విద్యుత్‌ ప్రాజెక్టు, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా హామీలు నెరవేరుస్తాం
కరీంనగర్‌ భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ
కరీంనగర్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి)
మాట ఇచ్చాం తెలంగాణ ప్రజల కల సాకారం చేశామని కాంగ్రెస్‌ పా ర్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నా రు. తాము ఇచ్చిన హామీ మేరకు తె లంగాణ ఏర్పాటు చేసిందని సోని యా స్పష్టం చేశారు. అందరినీ ఒ ప్పించి తెలంగాణ ఏర్పాటు చేయడా నికి సుదీర్ఘ సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సుధీర్ఘ పోరాటల తర్వాతే తెలంగాణ సాకారమైందని, జూన్‌ 2న తెలంగాణ ఏర్పడబోతోం దని అంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోని యాగాంధీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్లుప్తంగా మాట్లాడిన సో నియా విషయాలను సూటిగా చెప్పా రు. తెలంగాణ ఏర్పాటు, పునర్నిర్మా ణం సహా అనేక అంశాలపై కాం గ్రెస్‌ వైకరిని ఆమె స్పష్టం చేశారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరవాత విూ కల నెరవేరిందన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటులో టిఆర్‌ఎస్‌ ప్రమేయం ఏవిూ లేదని ఆమె స్ప ష్టం చేశారు. తెలంగాణ బిల్లు పార్ల మెంట్‌ లో ప్రవేశపెట్టడంలో టిఆర్‌ ఎస్‌ పార్టీ పాత్ర ఏమాత్రం లేదని సోనియా స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగాక తొలిసారిగా కరీం నగర్‌ కు వచ్చిన సోనియా ఇక్కడ బహిరంగ సభలో
మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామన్నారు. చివరి క్షణం వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పలువురు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఓ వైపు బిజెపి, టిడిపి, వైకాపా అందరూ అడ్డుపడ్డారన్నారు. రాజ్యసభలో టీ.బిల్లుకు బిజెపి అడ్డుపడిందని చెప్పారు. అయినా నాలుగున్న కోట్ల ఆకాంక్షను కాంగ్రెస్‌ నెరవేర్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ వల్లే పార్లమెంట్‌ లో తెలంగాణ బిల్లు నెగ్గిందని తెలిపారు. తెరాస ఏర్పడకముందే తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్‌ చేపట్టిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామన్నారు. చివరి క్షణం వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పలువురు అడ్డుపడ్డారని ఆరోపించారు. సెప్టెంబర్‌ 2000లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రజల ఆకాంక్షను చెప్పారని, కాంగ్రెస్‌ లేవనెత్తిన అంశాన్ని తెరాస 2001లో అందుకుందని సోనియా పేర్కొన్నారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ చేసిందేవిూలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పుట్టక ముందే కాంగ్రెస్‌ తెలంగాణ అంశాన్ని చేపట్టిందని స్పష్టం చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదానికి తాము తీవ్రంగా కృషిచేశామన్నారు. సుధీర్ఘ పోరాటం తర్వాతే తెలంగాణ కల సాకారమైందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ ఇవ్వాలనేది కాంగ్రెస్‌ సంకల్పమని, అందుకే తెలంగాణ ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు శిరసువంచి వందనం చేస్తున్నానని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఉద్యమకారుల ఆవేదన తమకు విన్పించిందని అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశామని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్లుగా పోరాటాలు చేసిన సంగతి తనకు తెలుసన్నారు. అనేకసంఘర్షణల తర్వాత తెలంగాణ కల సాకారమైందన్నారు. తెలంగాణ ఇవ్వాలన్నది కాంగ్రెస్‌ సంకల్పమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు శిరసువంచి వందనం చేస్తున్నానంటూ సోనియా తన ప్రసంగం ప్రారంభించారు. తాము ఏం చెబితే అది చేసి చూపిస్తామని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇక పోరాటం అయిపోయింది. ఇక పాలన చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పని కేవలం కాంగ్రెస్‌ మాత్రమే చేయగలదు. టీఆర్‌ఎస్‌ కేవలం అవతలివాళ్లను దూషించడానికే పరిమితం అయిపోతోంది తప్ప వాళ్లకు పాలనానుభవం లేదు. అందువల్ల మీ అందరికీ నేను చేసేది ఒకటే విజ్ఞప్తి. మీరు సీమాంధ్ర ప్రజలందరితో సోదర భావంతో ఉండాలి తప్ప.. కొట్లాటలు కూడదు. విూ అందరూ ఒక్కొక్క ఓటు కాంగ్రెస్‌ పార్టీకే వేయండి. ఆ ఓట్లే తెలంగాణ బంగారు భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. విూరు విూ స్వప్నాన్ని సాకారం చేసుకోడానికి సుదీర్ఘ పోరాటం చేశారు. కొన్నేళ్లుగా విూరు చేసిన పోరాటం ఇప్పుడు నిజమై సాక్షాత్కరించింది. కాంగ్రెస్‌ పార్టీ విూ స్వప్నాన్ని సాకారం చేసింది. జూన్‌ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ 29వ రాష్ట్రం కానుంది. అమరవీరులందరికీ సలాం చేస్తున్నాను. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నవారు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు, పాత్రికేయులు ఇలా 60 ఏళ్లుగా ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు. కాంగ్రెస్‌ పార్టీ విూ అందరి ఆవేదన విన్నది. అందుకే రాష్ట్రం ఇచ్చాం. రెండోవైపు ఉన్నవాళ్లను ఒప్పించడానికిసమయం పట్టింది. అందుకే ఆలస్యమైంది. విూ అధికారం, విూ న్యాయమైన వాటా దక్కాలనే మేం భావించాం. రెండు రాష్ట్రాల ప్రజలు నా హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్లే. సీమాంధ్ర ప్రజలకు మేం చేసిన వాగ్గానాలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చుకుంటాం. సామాజిక న్యాయం చేయాలన్న కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకునే ఇచ్చాం. సమాజంలో బలహీనవర్గాల చేతుల్లోనే దళితులు,ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, యువకులు ఇలా అందరి చేతుల్లో అధికారం పెట్టాలనే తెలంగాణ ఇచ్చాం. తెలంగాణలో ఎప్పుడూ లౌకిక భావనలను గౌరవిస్తూనే వచ్చారు. వీటికోసమే ఇందిరమ్మ, రాజీవ్‌ గాంధీ తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల వల్ల ఈ లౌకిక భావన ప్రమాదంలో పడింది. కాంగ్రెస్‌ మాత్రం ఎప్పుడూ కులమతాల ఆధారంగా, భాష పేరుతో భేదభావాలు చూపించలేదు. ఇతర పార్టీలు కులమతాల పేరుతో చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు అవే పార్టీలు అధికారంలోకి రావాలని కలలు కంటున్నాయి. భవిష్యత్తులో కూడా అలా చేసే ప్రమాదముంది కాబట్టి విూరంతా జాగ్రత్తగా వ్యవహరించాలి. యూపీఏ ప్రభుత్వం తమ పదేళ్ల పాలనలో సమాజంలోని అన్ని వర్గాల మేలు కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది’ అని సోనియా అన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌ ప్లాంట్లలో ఒకటిగా 4వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుచేస్తున్నాం. మా తెలంగాణ మేనిఫెస్టోలో కూడా రైతుల రుణబాధలను తగ్గించడం, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి లాంటి అనేక కార్యక్రమాలున్నాయి. హైదరాబాద్‌ ప్రాధాన్యాన్ని అలాగే నిలబెట్టడంతో పాటు తెలంగాణలోని ఇతర నగరాలను కూడా అభివృద్ధి చేస్తాం. మేం చేసిన వాగ్దానాలు కచ్చితంగా నిలబెట్టుకుంటాం. ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ ¬దా కల్పిస్తామన్నారు. సీమాంధ్రకు తగిన న్యాయం చేస్తామని, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని సోనియా చెప్పారు. ఇందులో భాగంగానే ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ¬దా కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గత పదేళ్ల తమ పాలనలో ఎన్నో సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని, అలాగే సీమాంధ్రకు తగిన న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. క్లుప్తంగా మాట్లాడిన సోనియా సూటిగా మాట్లాడారు. చివరగా అందిరతో జైహింద్‌ అనిపించారు. తెలంగాణ జిల్లాల నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సోనియకు కండువాలు కప్పి అభివాదం చేశారు. కొందరు ఆమెకు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆమె ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లిపోయారు.