ఎన్నికల్లో అక్రమ డబ్బు స్వాధీనంలో రాష్ట్రమే టాప్
105 కోట్లు స్వాధీనం
25,300 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
మద్యం తరలింపులో 29,200 కేసులు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా చేపడుతున్న తని ఖీల్లో ఒక్క ఆంధ్రద్రేశ్‌లోనే అత్యధికంగా 105 కోట్ల డబ్బు స్వాధీనం చేసుకున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడా స్వాధీనం చేసుకోలేదన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారుతోందన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసు కుంటామన్నారు. రాష్ట్ర పర్యటన ముగిసిన అనంతరం సంపత్ మీడియాతో మాట్లాడారు. ఉదయం నుంచి ఆయన రాజకీయ పార్టీలు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,142 అక్రమ నగదు తరలింపు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మద్యం తరలింపులో 29,290 కేసు లు నమోదయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25,300 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక
భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 6.48 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 25,300 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు సీఈసీ సంపత్ తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 6.48 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని, దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 105 కోట్లు స్వాధీనం చేసుకున్నామని సీఈసీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,142 అక్రమ నగదు తరలింపు కేసులు నమోదయ్యాయని మద్యం తరలింపులో 29, 290 కేసులు నమోదయ్యాయని సీఈసీ సంపత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈసారి అన్నీ కొత్త ఈవీఎంలు వాడుతున్నామని సీఈసీ చెప్పారు. ఈవీఎంలలో తలెత్తే అన్ని సమస్యలను అధిగమిస్తామన్నారు. కొన్నిచోట్ల ఒకే పార్టీకి ఓట్లు పడినట్లు ఫిర్యాదులొచ్చాయని ఆయన తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించామన్నారు. నోటా ఓటుకు గుర్తింపు చిహ్నం ఇచ్చేందుకు యత్నిస్తున్నామని సీఈసీ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పాల్గొన్నారు.