నన్ను ప్రలోభ పెట్టాలని చూశారు


వైఎస్‌, కేవీపీని దూతగా పంపాడు
నేను డబ్బుకు, పదవులకు లొంగను.. నా ద్యాస, శ్వాస తెలంగాణే : కేసీఆర్‌
చేవెళ్ల, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) :తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేస్తున్న తనను ప్రలోభ పెట్టాలని సీమాంధ్ర పెత్తందారులు చూశారని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అన్నారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన వద్దకు కేవీపీ రామచంద్రారావును దూతగా పంపారని ఆయన చె ప్పారు. తాను డబ్బుకు, పదవులకు లొంగబోననని, తన ద్యాస, శ్వాస తెలంగాణేనని ఆయన తేల్చిచెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగా సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 90 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేసీఆర్‌ అన్నారు. కొత ్తగా ఏర్పాటైన తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంటే అభివృద్ది సా ధ్యమన్నారు. కెసిఆర్‌ ఎజెండా తెలంగాణ అని, ఆంధ్రోళ్ల కొమ్ము గాయనన్నారు. వైఎస్‌ ఉన్నప్పుడు తనను లొంగదీయడానికి కెేవీపీతో బేరం పెట్టారని సంచలన ప్రకట చేశారు. అయినా తాను లొంగలేద న్నారు. తాను దేనికీ లొంగననే తనను అధికారంలోకి రాకుండా చూస్తు న్నారని హెచ్చరించారు. ఇవి ఆషామాషీగా వచ్చిన ఎన్నికలు కాదని, ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లల్లో టీఆర్‌ఎస్‌ వారినే గెలిపించాలన్నారు. సమైక్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆగమైందని టీఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో జరుగుతున్న ఎన్నికలు ఇవని, ఎన్నికల వేళ ఏమరపాటుగా ఉంటే దెబ్బ తింటామని హెచ్చరించారు. మన తలరాతను మనమే రాసుకుం దామని, ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలంగాణపై ఆంధ్రోళ్ల కుట్రలు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడి భూముల కబ్జాలను టిఆర్‌ఎస్‌ వస్తే అడ్డుకుంటుందని, కబ్జాచేసిన భూములను ముక్కుపిండి లాక్కుంటామని టీఆర్‌ఎస్‌ రాకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. చంద్రబా బు,వెంకయ్యనాయుడుల చీకటి ఒప్పందం ఇదేనన్నారు. ఇక్కడ కబ్జా భూములను కక్కిస్తామన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు పాత సుతర్లేనని వారి పాలన గురించి తెలియనిదెవరికన్నారు. వీరిని నమ్మకుంటే అభివృద్ది జరగదన్నారు. కేవీపీ పైరవీతో పిసిసి చీఫ్‌ అయిన పొన్నాల ఆంధ్రోళ్లకు తొత్తుగానే ఉంటాడన్నారు. ఇక టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక డ్వా క్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారు. ఐకేపీ కింద పని చేసి మహిళలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. వీవోఏలకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల జీతం చేస్తామ న్నారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడిషీయల్‌ పవర్స్‌ ఇస్తా మని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన పెడ్తామని చెప్పారు. భవి ష్యత్‌లో రంగారెడ్డి భూములు బంగారు గనుల్లా తయారవుతాయని కేసీ ఆర్‌ పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ పార్క్‌ రంగారెడ్డి జిల్లాలో విస్తరించి హైద రాబాద్‌ విశ్వనగరంగా ఆవిర్భస్తుందన్నారు. అప్పుడు రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు మరింత పెరుగుతాయి. భూముల ధరలు పడిపోవు. ఇప్పుడు ఎకరా రూ. 2 కోట్లు ఉంటే భవిష్యత్‌లో రూ. 20 కోట్ల వరకు ధర పలుకుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో మరో 2 కోట్ల జనాభా పెరుగుతోందన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిది ద్దుతాం. హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్టు అవసరమన్నారు. తెలం గాణ రాష్ట్రంలో చేవెళ్లలో కూరగాయాల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
పేర్కొన్నారు. కూరగాయాలు పండించే రైతుల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయంలో మరింత అభివద్ధి తీసుకోస్తామని చెప్పారు. చేవెళ్ల నుంచే హైదరాబాద్‌కు కూరగాయాలు సరఫరా అవుతున్నాయని తెలిపారు. అలాగే శంకర్‌పల్లిలో విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరు జిల్లా కొంద్గురు మండలం లక్ష్మీదేవిపల్లిలో పెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు తీసుకోస్తానని చెప్పారు. అప్పుడు రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. తెలంగాణ కోసం అమరుడైన యాదిరెడ్డి ఆత్మ శాంతించాలంటే వాళ్ల చావుకు కారకులైన కాంగ్రెస్‌, టీడీపీని గెలిపించొద్దని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మొయినాబాద్‌లో యాదిరెడ్డి జ్ఞాపకార్థం స్మారక స్థూపాన్ని కట్టిస్తామన్నారు. అమరుల ఆశయాలు నెరవేరాలంటే టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాధించిన ఘనత పాలమూరుదే
మహబూబ్‌నగర్‌ : తాను పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ సాధించిన.. ఇంకా పాలమూరుకు బాకీ ఉన్నా.. పాలమూరు రుణం తీర్చుకుంటానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తాను ఇక్కడ ఎంపీగా ఉండగానే తెలంగాణ రావడం చరిత్రలో లిఖించబడుతుందన్నారు. తనను కడుపులో పెట్టుకుని ఎక్కడి నుంచో వచ్చినా గెలిపించినందుకు రుణపడి ఉన్నానని అన్నారు. షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఎంపీగా తెలంగాణ సాధించిన ఘనత పాలమూరుకే దక్కుతుందన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దీక్షలు, లాఠీ దెబ్బలు, ఫైరిరగ్‌లు ఎదుర్కొన్న తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే టీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వాలి. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ ప్రజలు కోటి ఆశలు నెరవేరుతాయి. కాంగ్రెస్‌, టీడీపీలు ఎంతపాటి పని చేస్తారో మనకు తెలుసు. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి సాధించామన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ఏసీ గదుద్లో కూర్చుని అధికారం అనుభవించారని అన్నారు. వారికి మన ఆర్తి తెలియదన్నారు. వారెన్నడన్నా రైలు ఆపారా, జైలుకు వెళ్లారా, ఉద్యమం చేసారా, లాఠీ దెబ్బతిన్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు వారికి మన బాధలు ఎలా తెలుస్తాయన్నారు. అందుకే ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైనవి.. ఎన్నికలు ఆషామాషీగా జరుగతలేవు. ఆలోచించి ఓటేయ్యాలన్నారు. ఆంధ్రా పార్టీలకు ఓటేయొద్దు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఆంధ్రా పార్టీలు అవసరమా? అని అన్నారు. చంద్రబాబుకు ఇక్కడ ఏం పనని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో అంజయ్యయాదవ్‌ను గెలిపించాలన్నారు. అంజయ్య సౌమ్యుడు.. బీసీలంతా ఒక్కటై ఆయనను గెలిపించాలి. ఎంపీ అభ్యర్థి జితేందర్‌రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబందనలు పెడతామన్నారు. దీనివల్ల షాద్‌నగర్‌ యువతకు ఉద్యోగాలు దక్కుతాయన్నారు. జిల్లాలో కృష్ణా నది పారిన షాద్‌నగర్‌ ఎండిపోయింది. షాద్‌నగర్‌కు కృష్ణా నీళ్లు తెప్పిస్తాం. ఈ నియోజకవర్గంలోని కొంద్గురు మండలం లక్ష్మీదేవిపల్లిలో పెద్ద ప్రాజెక్టును ఏర్పాటు చేస్తాం. అప్పుడు షాద్‌నగర్‌ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. లక్ష్మిదేవిపల్లి వద్ద ముదిరాజ్‌లకు చేపల పరిశ్రమను ఏర్పాటు చేస్తాం.