ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని
ఆదిలాబాద్‌ను కాశ్మీర్ చేస్తా
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్దరిస్తా : కేసీఆర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (జనంసాక్షి) :
ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపణలు గుప్పించ్చారు. సహజ వనరులు, ప్రకృతి అందానికి నిలయమైన ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక రం గంలో మరో కాశ్మీర్‌లా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్దరిస్తానని ఆయన చెప్పారు. 60 ఏళ్ల తెలం గాణ ఉద్యమం సాకారమై తెలంగాణ కు మంచి రోజులు వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడి అవినీతి రహిత సమాజాన్ని ఏర్ప రుస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. నిర్మల్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చుదిద్దుతామని ఆయన హమీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు వనరులను దోచుకొని ఆంధ్రపాలకు వారి ఆస్తులను పెంచుకుంకున్నారని, ఇప్పటికీ అదే ధోరణితో తెలంగాణ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన
సీమాంధ్ర పార్టీల నాయకులపై దుమ్మెత్తిపోశారు. అదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా ఎన్నో సహజ వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం పరుచు కుని జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. మారు మూల గ్రామాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఎన్నో వైద్య సేవలు చేస్తున్నారని వారికి గుర్తించి ప్రభుత్వం ఆమోదిత పత్రాలు అందజేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. వితంతు, వ్రుద్దాప్య పించన్‌లు రూ.1000, వికలాంగులకు రూ.1500 ఇస్తామని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు రెండు పడక గదులు, వంట గది, హాలు తో కలిపి పరిపూర్ణంగా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని చదువుల తల్లి పుణ్యక్షేత్రం భాసర ను మరో తిరుమల తిరుపతి దేవస్థానంలా మారుస్తామని అన్నారు. నిర్మల్ డివిజన్ లోని ఎస్సారెస్పీ ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు నష్ట పరిహారం అందించ లేదని వారందరికి ఆరునెళ్ళ లోపు పరిహారం అందిస్తామని హీమి ఇచ్చారు. జిల్లాలో 12శాతం వర్ష పాతం నమోదవుతుందని దీంతో వాగులు, చెరువులు పూర్తిగా నిండుతాయని ఆ నీటిని సద్వినియోగ పరు చుకుని వంజరు భూములన్ని సాగులోకి తీసుకు వచ్చేందుకు తనే స్వయంగా ప్రాజేక్టుల నిర్మాణానికి క్రుషి చేస్తానని చెప్పారు. మామడా మండలంలో 400కేవీ మెగావాట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించి ప్రజలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు డబ్బులకు, మధ్యం, ఇతర నజరానాలకు లొంగకుండా పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. 12ఏళ్ల పాలు ఉధ్యమంలో తనకు సహకరించినట్లే ఈ ఎన్నికల్లో కూడా తాను నిలపెట్టిన టిఆర్‌ఎస్ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం బెల్లంపల్లిలోని తిలక్‌స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో కొత్తబావుల ఏర్పాటుకు టీఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తుందని, ఓపెన్‌కాస్టులు అడ్డుకుంటామని, సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు సేవాలందిచేందుకు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే రైతులకు లక్ష రూపాయాల రుణమాఫీ, ఎస్టీ, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, వృద్ధులకు వేయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయాల ఫించన్ ఇస్తామని ఆయన పేర్కోన్నారు. లంబడితాండాలను, గొండు గూడలను గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేస్తామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి, యువతి, యువకులకు ఉపాధి కల్పిస్తామని, అస్సాంలోని చిరపుంజీ తరువాత ఆదిలాబాద్ జిల్లానే ఎక్కువ వర్షం పాతం నమోదు అయ్యే జిల్లాఅని, దీంతో పంట పొలాలు సస్యశామలం అవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి మెనిఫెస్టులో చేప్పిన విధంగా అన్ని పథకాలను అధికారంలోకి వస్తే అమలు చేస్తామని, టీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్ధి బాల్కసుమన్ విద్యార్ధి దశలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించాడని, అందుకే అతని సేవలను గుర్తించి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని, బెల్లంపల్లి అసెంబ్లి అభ్యర్థి దుర్గం చిన్నయ్యను అత్యధిక మెజార్టితో గెలిపించి బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి తొడ్పాటు అందించి, రాజకీయ అవినీతి పరులను ఈ ఎన్నికల్లో వారికి తగిని గుణపాఠం చేప్పాలని, ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని, మనం వేసే ఓటు మన తలరాతను మార్చే విధంగా ఉండాలని ఆయన అన్నారు. ఆసిఫాబాద్ ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడిపీలను ఎన్నికలలో బొంద పెట్టాలన్నారు. జిల్లాలో 24 ప్రాజెక్టులను కట్టి వాటికి కనీసం కాల్వలను కూడ తవ్వించని ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు ఏరోజు పాల్గొనలేదని, ఉద్యమకారుల వీపులపై లాఠీ దెబ్బలు,అక్రమ కేసులు బనాయించిన సందర్బాలలో కాంగ్రెస్, టిడిపి నేతలు హైదరాబాద్‌లో ఎ.సి రూంలలో పడుకున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా వెంకయ్య నాయుడు,చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని కేసిఆర్ ఆరోపించారు. గోండు, కోయ గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, జోడెఘాట్‌ను పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు.వీ టన్నిటిని సాదించాలంటే ఇంటి పార్టియైన టిఆర్‌ఎస్ నిలబెట్టిన అభ్యర్థులనే గెలిపించాలని కేసిఆర్ పిలుపునిచ్చారు.