తెలుగు స్ఫూర్తికి విఘాతం కలిగించారు


తెలుగు తల్లిని చంపేశారు
తెలంగాణ, సీమాంధ్రలను అనాథలుగా మార్చారు
నరేంద్రమోడీ ఆవేదన
నిజమాబాద్‌/కరీంనగర్‌/మహబూబ్‌నగర్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :
తెలుగు స్ఫూర్తికి యూపీఏ ప్రభుత్వం విఘాతం కలిగించిందని, తెలుగు తల్లిని చంపేసి తెలంగాణ, సీమాంధ్రలను అనాథలుగా మిగిల్చిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌కు అత్యంత కీలకమని, ఇప్పుడు గెలిచే పార్టీ సమర్థత విూదే తెలంగాణ అభి వృద్ధి ఆధారపడి ఉంటుందని మోడీ అన్నారు. ఆయన మం గళవారం తెలంగాణలోని నిజమాబాద్‌, కరీంనగర్‌, మహబూ బ్‌నగర్‌, హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహి రంగ సభల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ భాగ్యరేఖ ఇక్కడి ప్రతి యువకుడి చేతిలో అతడి బంగారు భవిష్యత్తు స్పష్టంగా కన్పించినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి సార్థకత అని మోడీ అన్నారు. నిజామాబాద్‌లో భారత్‌ విజయర్యాలీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంటే ఎందరో తల్లుల కన్నీటి ఫలిత మన్నారు. వందలాది యువకుల బలిదానాల ఫలితంగా లభించి న ఈ తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టాలో బాగా ఆలోచిం చుకోవాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఎవరో ఇస్తే రాలేదని, ఇక్కడి యువత బలిదానాలతో తెచ్చుకున్నామ న్నారు. రాష్ట్రం ఏర్పడడం, ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావ డం చెప్పుకోదగ్గ విషయాలు కాదని, కొత్త రాష్టాన్రికి మంచి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికలను చూడవద్దన్నారు. ఓ కుటుంబం కో సం ఈ ఎన్నికలు ఉపయోగపడరాదన్నారు. తాము అధికారం లోకి వస్తే తెలంగాణ భాగ్యరేఖను మారుస్తామని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ ప్రజలపై ఉన్న
నమ్మకంతోనే ఇక్కడకి వచ్చానన్న ఆయన వచ్చే ఐదేళ్లలో తెలంగాణ సమస్యలను తాము పరిష్కరిస్తామన్నారు. తెలంగాణలో, ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉంటే తెలంగాణ ప్రజలకు అన్నివిధాలా బాగుంటుందని ఆయన అన్నారు. నిజామాబాద్‌ యువకులు కూలీలుగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్నారని అలా వెళ్లిన వాళ్ల భద్రతకు హావిూ ఎవరని నరేంద్రమోడీ ప్రశ్నించారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలను వివరించారు. ఏళ్లతరబడి కుటుంబాలకు దూరంగా వారెందుకు బతకాల్సివస్తోంది, కుటుంబయజమాని ఎక్కడో ఉంటే ఇక్కడి వారి భార్యాబిడ్డల పరిస్థితి ఏమిటని మోడీ ప్రశ్నించారు. వారి శ్రమకు తగిన విలువ వారికి లభిస్తోందా అని మోడీ ప్రశ్నించారు. వారందరికీ ఇక్కడ ఉపాధి దొరికితే గల్ఫ్‌కి వెళ్లి బాధలు పడాల్సిన అవసరమేంటని మోడీ ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒక జిల్లా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యను పరిష్కరించలేకపోయిందని మోడీ విమర్శించారు. సూరత్‌లోనూ తెలంగాణ యువకులు పనిచేస్తున్నారని, వారిని అడగండి ఏం చెబుతారో అని మోడీ అన్నారు. అక్కడ వారి ఆలనాపాలనా తాను సరిగా చూస్తున్నానని అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇస్తే రాలేదు. బలిదానాలు చేసి సాధించుకుంటే వచ్చిందని నరేంద్రమోదీ అన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేస్తే అమరులను అవమానించినట్లే. తెలంగాణ ప్రజలు ఎన్నో ఎన్నికలు చూసి ఉంటారు. ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి. తల్లి చనిపోయాక పుట్టిన బిడ్డను పెంచడం సామాన్య విషయం కాదు. తెలంగాణ డిమాండ్‌ను ఎన్నో ఏళ్లు పట్టించుకోని పార్టీకి మద్దతు ఇవ్వొద్దని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలకు ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకమని మోడీ గుర్తు చేశారు. గతంలో ఎన్నో ఎన్నికల్లు చూశారు.. ఓటు వేశారు కాని తెలంగాణ అభివృద్దికి ఈ ఎన్నికలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి అని అన్నారు. ఢిల్లీ లో ఎలాంటి ప్రభుత్వం ఉండాల్లో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం యువకులు బలిదానం చేస్తే ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిందని ఎవరో ఇస్తే వచ్చింది కాదని మోడీ అన్నారు. తెలంగాణ యువకుల భవిష్యత్‌ రేఖను మారుస్తానని మోడీ అన్నారు. జై జవాన్‌, జై కిసాన్‌ అని లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి అంటే.. మారో కిసాన్‌.. మారో జవాన్‌ కాంగ్రెస్‌ నినాదమన్నారు. గుజరాత్‌ లోని సూరత్‌ లో వేలాదిమంది తెలంగాణ ప్రాంతవాసులు ఉంటారని.. వారిని తాను బాగానే చూసుకుంటానని మోడీ అన్నారు. దేశంలోనే అత్యధికంగా నిజమాబాద్‌ జిల్లాలో పసుపు పంట ఉత్పత్తి ఉంటుందని.. అలాంటి ఈ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలను ఎలా చూసుకోవాలో తనకు అనుభవం ఉందన్నారు. తెలంగాణ ప్రజల మేలు కోసం ఢిల్లీలో బీజేపీ అధికారం అప్పగించాలన్నారు. సీమాంధ్ర కాని, తెలంగాణ కాని తెలుగు తన తల్లి లాంటిదన్నారు. అలాంటి తన తెలుగు తల్లిని కాంగ్రెస్‌ హత్య చేసి బిడ్డకు జన్మనిచ్చారన్నారు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి అంజయ్యను రాహుల్‌ తండ్రి రాజీవ్‌ అవమానించారని, కాంగ్రెస్‌ ప్రధానిగా ప్రపంచమంతా పేరొందిన నరసింహారావును సోనియా అవమానించారని మోడీ గుర్తుచేశారు. ఆయన అంత్యక్రియలను కూడా గౌరవప్రదంగా జరగనీయలేదన్నారు. ఈ దేశ ప్రధానిగా చేసిన వ్యక్తి జయంతి, వర్థంతి కార్యక్రమాలప్పుడు నివాళులర్పించేందుకు చేతులు రాని కాంగ్రెస్‌ పార్టీ ఇదని, తెలంగాణ ప్రజలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటని మోడీ ఘాటుగా విమర్శించారు. అలాంటి పాపాత్ములైన నేతలున్న పార్టీకి ఓటేసి గెలిపించాలా అని మోడీ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడడం, సీమాంధ్రలో ఆందోళనలు… ఈ నేపథ్యంలో తాను చాలా విచారంగా ఉన్న సమయంలో పవన్‌ కల్యాణ్‌ తనని కలిశారని మోడీ గుర్తుచేసుకున్నారు. పవన్‌ మాటలు తన మనసుని కదిలించాయన్నారు. పవన్‌ లాంటి మనసున్న యువకులున్న ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తెలుగు స్ఫూర్తి ఎప్పటికీ మరుగున పడదని, ఈ రెండు రాష్టాన్రూ సామరస్యంగా ముందుకు తీసుకెళ్లగల సత్తా తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల యువకులకూ ఉందని మోడీ ప్రశంసించారు. తెలంగాణ ప్రాంత నాయకుడు అంజయ్యను అవమానించిన పాపం రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీదేనని అన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రధానిగా ఎన్నికైన పీవి నర్సింహరావును కూడా కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. పీవీ జన్మదినం, వర్ధంతి రోజున పుష్పాలు ఉంచడానికి ఆలోచన చేయదన్నారు. పీవీ పేరును నామరూపాల్లేకుండా చేసింది ఈ కాంగ్రేసేనని మోడీ ధ్వజమెత్తారు. కొత్త రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్‌లో చేతిలో పెట్టొద్దని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో జరిగిన ఆ పార్టీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కుటుంబ పాలనే కాంగ్రెస్‌ లక్ష్యం అన్నారు. తల్లీకూతుళ్ల చేతిలో ఈ తెలంగాణను పెట్టి మోసపోవద్దన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టాన్న్రి ఎవరు అభివద్ధి చేయగలరో ప్రజలు గ్రహించాలి. పురుడు పోసి తల్లిని చంపేపార్టీ కాంగ్రెస్‌. గుజరాత్‌ అభివద్ధిని సూరత్‌లోని తెలుగువారిని అడిగినా చెబుతారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణను అభివద్ధి చేసి చూపుతాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో విూరే నిర్ణయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మంగళవారం కరీంగనర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి చేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజలకు పరీక్షల్లాంటివని, బీజేపీ లాంటి బాధ్యతాయుత పార్టీకి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని ఇక్కడే చెప్పానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం 1200 మంది యువత ప్రాణత్యాగం చేసింది. కాంగ్రెస్‌ను మనం నమ్మగలామా అని ఆయన ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం కాంగ్రెస్‌ చేతిలో పెట్టొద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. కొంత మంది తెలంగాణ అభివృద్ధి తమవల్లే జరిగిందని అంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో తల్లి, కొడుకు పాలన కోరుకుంటారా?, తెలంగాణలో తండ్రి, కొడుకుల పాలన కోరుకుంటారా?అని మోదీ ప్రశ్నించారు. అదే జరిగితే తెలంగాణను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. కుటుంబ రాజకీయాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. పసిబిడ్డను పెంచినట్లు తెలంగాణను అభివృది చేయాలని మోదీ తెలిపారు. కేంద్రంలో నా ప్రభుత్వం, రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణకు విద్యుత్‌ కష్టాలు తీరుస్తానని మోదీ హావిూ ఇచ్చారు. దేశమంతా సునావిూ వీస్తోందని, ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చి తీరుతుందని నరేంద్రమోడీ అన్నారు. తెలంగాణలోనూ భాజపా-తెలంగాణ ప్రభుత్వం రావాలన్నారు. అందుకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా భాజపా, తెదేపా అభ్యర్థులందరినీ గెలిపించాలన్నారు. అప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. వారసత్వ, కుటుంబపాలనకు స్వస్తి పలకాలని అభివృద్ధి ఎజెండాగా విూ ముందుకొస్తున్న అభ్యర్థులకు ఓటేయాలని మోడీ పిలుపునిచ్చారు.