వారణాసిలో నామినేషన్ వేసిన మోడీ
వారణాసి, ఏప్రిల్ 24 (జనంసాక్షి) :
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోక్‌సభ స్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నామినేషన్ దాఖలు చేశా రు. మోడీ వెంట ఆయన సన్నిహితుడు అమిత్ షా, బీజేపీ నేత లు రవిశంకర్ ప్రసాద్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ తదితరులు ఉ న్నారు. మోడీకి ప్రతిపాదికులుగా మదనమోహన్ మాలవ్య మ నువడు గిరిధర్ మాలవ్య, పద్మవిభూషణ్ చందూలాల్ మిశ్రాల తో పాటు పడవ నడిపే వ్యక్తి, బలహీన వర్గాలకు చెందిన మరో వ్యక్తి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఉదయం ఇక్క డికి చేరుకున్న ఆయన మదనమోహన మాలవ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బనారస్ హిందూ విశ్వవి ద్యాలయం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల సందడితో దా దాపు మూడు గంటల పాటు మోడీ రోడ్ షో కొనసాగింది. కేవలం బీజేపీ కార్యకర్తలు, మోడీ
అభిమానులే కాకుండా సాధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం మోడీ విూడియాతో మాట్లాడారు. తనకు గంగాదేవి ఆశీస్సులు ఉన్నాయని, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు గంగామాత తనను వారణాసికి ఆహ్వానించిందని తెలిపారు. వారణాసిని ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఒకవేళ బీజేపీ తనను ఇక్కడికి పంపించికపోయినా గంగామాత తనను ఇక్కడికి రప్పించేదన్నారు. తనను ఆశీర్వదించాలని స్థానికులను కోరిన మోడ వారణాసిని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతానన్నారు. వారణాసిని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు తనకు శక్తినివ్వాలని దేవుణ్ని ప్రార్థించారు. తాను జన్మించిన వాద్‌నగర్‌తో పాటు వారణాసి శివుని పుణ్యక్షేత్రాలని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వద్ద మూడు కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ తాను పకీర్‌నని చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.