అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా హైదరాబాద్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మహిళే
రూ.2 లక్షల వరకు రైతు రుణాల మాఫీ
మేడిన్ తెలంగాణ, మేడిన్ హైదరాబాద్
తిరుగులేని శక్తిగా తెలంగాణ రాష్ట్రం : రాహుల్
హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 25 (జనంసాక్షి) :
అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, తెలంగాణ రాష్ట్రానికి మహిళనే తొలి ముఖ్యమంత్రిని చేస్తామని కాం గ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఇందులో కేసీఆర్ లేదా టీఆర్‌ఎస్ పాత్ర ఎంతమాత్రం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రా హుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత ప్రజలు చేసిన పోరా టాన్ని గుర్తించి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్దిని కూడా చేసి చూ పుతుందని అన్నారు. అద్భతమైన తెలంగాణ అబివృద్ధి కేవలం కాం గ్రెస్ వల్లనే సాధ్యమని అన్నారు. అరవయ్యేళ్ల కల ఫలించిన సమయ మిదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు భాజపా, తెలుగుదేశం పార్టీలు యత్నించాయని కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎల్బీస్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెరాస కంటే తెలంగాణ కోసం పోరా డింది కాంగ్రెస్సేనని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్
కన్నా ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది సంతకాలు సేకరించి తెలంగాణ కోసం పోరాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని వర్గాలు కలిసి బంగారు తెలంగాణకు కృషిచేయా లన్నారు. సామాజికన్యాయం అంటే అందరికి న్యాయం జరగడమే అని ఆయన పేర్కొన్నారు. తెలం గాణ, సీమాంధ్ర రాష్టాల్రు అభివృద్ధిలో ముందు వుండాలని ఆయనన్నారు. కాంగ్రెస్ హాయాంలోనే మహిళాభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కాంగ్రెస్ హాయంలో మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకువచ్చామన్నారు. దీంతో పాటు మహిళల అభ్యర్థన మే రకు గ్యాస్ సిలిండర్ల కోటాను 9 నుంచి 12కు పెంచిన ఘనత కాంగ్రెస్ సర్కారుదేనన్నారు. తనకు మేడిన్ తెలంగాణ వాచీ కావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ వస్తు ఉత్పత్తికి మారుపేరుగా నిలవాలన్నది తన స్వప్నమని చెప్పారు. ఇప్పటికైతే తనకు వాచీ లేదని మేడిన్ తెలంగాణ వాచీ కోసం ఎదురు చూ స్తున్నానని కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య ఆయన చెప్పారు. అనేక వస్తువులపై మేడిన్ చైనా ముద్ర కనిపిస్తోందన్నారు. అయితే మేడిన్ తెలంగాణ వుండాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొ న్నారు. మేడిన్ హైదరాబాద్, మేడిన్ తెలంగాణ వుండాలని అభిలషిస్తున్నట్టు ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు ఇతర వర్గాలకు పూర్తి రక్షణ కల్పిస్తా మని రాహుల్‌గాంధీ అన్నారు. నగరంలో ఉన్న సీమాంధ్రులు, ఇతర వర్గాల సంరక్షణను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం, మందులు అందిస్తామన్నారు. గత పదేళ్ల కాలంలో కోట్లాదిమందిని దారిద్యం నుంచి విముక్తి చేసామన్నారు. వ్యవసాయరుణాలను కూడా మాఫీచేస్తామని ఆయన అన్నారు. వస్తు ఉత్పత్తి ఇక్కడే జరిగితే అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. హైదరాబాద్ కేంద్రబిందువుగా మారాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఐటీఐర్ ప్రాజెక్టుతో పాటు తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఐటీఐఆర్‌తో లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్‌కు ప్రధానకేంద్రంగా వుంది ఇదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో పురోగమించాలన్నారు. తెలంగాణలో పదేళ్ల పాటు పన్ను మినహాయింపులు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన తెరాస అధినేత కేసీఆర్ మాట తప్పారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. కెసిఆర్ చెప్పిన మాటవిూద నిలబడడని అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడని అన్నారు. ఆయనను నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని, తమది మాట తప్పే పార్టీ కాదని ఆయన పేర్కొన్నారు. తెదేపా, భాజపా తెలంగాణ రావడానికి అడుగడుగునా అడ్డుపడిన సంగతి అందరికీ తెలుసన్న రాహుల్, తెలంగాణ బిల్లు రూపకల్పనలో కానీ, ఆమోదం పొందడంలో కాని తెరాస ఎక్కడన్నా కన్పించిందా అని ప్రశ్నించారు.తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమతుల్య అభివృద్ధి సాధిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. లౌకికవాద సిద్దాంతానికి కట్టుబడింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కొత్త రాష్ట్రంలోతమకు అధికారం కట్టబెట్టాలని కోరారు. రాష్ట్రం ముందుడాలంటే అనుభవం ఉన్న ప్రభుత్వం రావాలి. అది తెలిసింది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం. మమ్మల్ని అధికారంలోకి తెస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది. దేశంలోనే అతి పెద్దదైన 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఇక్కడ ఏర్పాటుచేస్తామన్నారు. 60 ఏళ్ల కల ఈ సంవత్సరం జూన్ రెండో తేదీన నెరవేరబోతోంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, టీచర్లు, న్యాయవాదులు అందరూ కలిసి పోరాడారు. వందలాదిమంది అమరుల త్యాగఫలితంగా రాష్ట్రం సిద్ధించింది. కాంగ్రెస్ లేనిదే ఈ స్వప్నం నెరవేరేదే కాదని అన్నారు. మీ మాట విన్నాం.. ప్రజాస్వామిక పద్ధతిని పాటించాం త్వరలోనే మీ కల నెరవేరనుంది. రెండు రాష్ట్రాల కలలనూ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం మాది. అందుకే రెండు ప్రాంతాలవాసుల కోరికలను మేం తీరుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు తెలంగాణలో చోటుండాలి. అత్యంత బలహీనవర్గాలకు కూడా న్యాయం జరగాలన్నదే సామాజిక న్యాయం అని అన్నారు. తెలంగాణలో అన్ని మతాలనూ గౌరవిస్తాం, లౌకికవాదానికి కట్టుబడతాం. బీజేపీ వాళ్లు హిందూ ముస్లింల మధ్య తగాదా పెడదామని చూస్తారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే అందరూ సోదరభావంతో ఉండాలని ఆయన చెప్పారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో పేదరికాన్ని తగ్గించామని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది గొప్ప విజయంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలాంటివి ఎన్నో పథకాలు రూపకల్పన చేసినట్లు రాహుల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ తర్జుమా చేశారు. వేదికపై గులాంనగబీ ఆజాద్, వాయిలార్ రవి, ఎంపీలు అంజన్ కుమార్, వీహెచ్, పొన్నాల తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రి కావాలన్నది తన కోరిక అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రత్యేకమైన కల కంటోందని దానిలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తామని రాహుల్ హావిూ ఇచ్చారు. వరంగల్ ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్‌లో మహిళల భాగస్వామ్యం మరింత పెంచుతామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పనే కాంగ్రెస్ సంకల్పమని స్పష్టంచేశారు. కేసీఆర్ లక్ష రుణమాపీకి దీటుగా స్పందించారు. రెండు లక్షలలోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ సభలో ప్రకటించారు. రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్న ఆయన తెలంగాణలో రైతు రుణాలు మాఫీ చేస్తామని తెరాస అధినేత చెబుతున్నారని, లక్ష రూపాయల వరకూ రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పారని, కానీ మాట ఇచ్చిన గంటకే మర్చిపోయే అలవాటు ఆయనకు ఉందని రాహుల్ అన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామంటే విపక్షాలన్నీ తమని విమర్శించాయని, కానీ రూ. 70 వేల కోట్ల వ్యవసాయ రుణాలను యూపీఏ ప్రభుత్వం మాఫీ చేసిందని రాహుల్ గుర్తుచేశారు. తెలంగాణ బిల్లు ప్రతిపాదనలో కానీ, రూపకల్పనలో కానీ, పార్లమెంటులో ఆమోదం పొందే విషయంలో కానీ తెరాస పాత్ర ఏవిూ లేదని రాహుల్‌గాంధీ అన్నారు. రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడిక అసలు ప్రశ్న తర్వాత ఏం జరగాలన్నదని రాహుల్ గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన సొంత రాష్టాన్న్రి అభివృద్ధి చేసుకోవాలంటే అందుకు తెలంగాణ ప్రజలు మరో గొప్ప స్వప్నం కనాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రతిఒక్కరిదీ కావాలన్నారు అందరికీ సామాజిక న్యాయం లభించాలన్నారు. సామాజిక న్యాయమంటే అతి పేదవారికి కూడా అన్ని హక్కులు లభించాలని రాహుల్ పేర్కొన్నారు. అందుకు నేతల నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉండాలని, వారి మాటలు, వాగ్దానాలే ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలిగిస్తాయని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెరాస అధినేత కేసీఆర్ విలీనంపై మాట ఇచ్చి నిలుపుకోని వైనాన్ని గుర్తుచేశారు. ఇలాంటి నేతలను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మాట నిలబెట్టుకోగల నేతలే అభివృద్ధిచేస్తారని రాహుల్ చెప్పారు. దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి వస్తువుపై మేడిన్ తెలంగాణ, మేడిన్ వరంగల్, మేడిన్ ఇండియా అని చూడాలన్నది తమ కల అని చెప్పారు. తెలంగాణలో అద్భుతమైన ఉత్పత్తి కేంద్రంగా వరంగల్‌ను తయారు చేస్తామని అందుకోసం ఈ ప్రాంతంలో 4వేల విద్యుత్ మెగావాట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హావిూ ఇచ్చారు.అంతేగాకుండా రాహుల్‌గాంధీ వరంగల్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్, ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. జిల్లాలో 150 కోట్లతో ఎయిమ్స్ స్థాయి మెడికల్ కళాశాల, భూపాలపల్లి పరిసరాల్లో 800 మెగావాట్ల విద్యుత్కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ తర్వాత మరో ఐటీ నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ పట్టణాన్ని ఐటీ హబ్‌గా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. తెలంగాణలో ఏటా లక్ష ఉద్యోగాలు సృష్టించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. మహిళా సాధికారత కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాహుల్ గాంధీ అన్నారు. డ్వాక్రా సంఘాల ప్రగతే అందుకు నిదర్శనమన్నారు. యూపీ, కాశ్మీర్ తదితర రాష్టాల్ల్రో డ్వాక్రా ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆంధప్రదేశ్ మహిళల గురించి తానే చెప్పానని, ఆంధ్ర మహిళలే వెళ్లి ఆయా రాష్ట్రాల్లో తమ సంఘాల గురించి చెప్పి వారూ అభివృద్ధి చెందేందుకు స్ఫూర్తినిచ్చారని రాహుల్ గుర్తుచేశారు. రాహుల్ హిందీ ప్రసంగాన్ని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తర్జుమా చేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ పొన్నాల, బలరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.