మాట ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చేశాం


తెలంగాణలో తొలి సర్కార్‌ కాంగ్రెస్‌దే కావాలి
అమరుల త్యాగం.. సోనియా
సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
నల్లగొండ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చి నెరవేర్చామని, తెలం గాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సారథ్యంలోనే మొదటి ప్రభు త్వం ఏర్పాటు కావాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభిల షించారు. తెలంగాణ ఇస్తామన్న మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశామన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగిన కాంగ్రెస్‌ ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎ లాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవా ల న్నారు. తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఏర్పాటుపై ఇ చ్చిన మాటను నిలబెట్టుకున్నామని ప్రధాని అన్నారు. కొ త్త రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజ లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పక్రియలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కాంగ్రెస్‌కు అధికా రం కట్టబెడితే దేశం గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణ ను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ అమరుల త్యాగం వృథా కాలేదన్నారు. తెలంగాణ అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. తెలంగాణలో ఏర్పడే తొలి ప్రభుత్వ భవిష్యత్‌ను నిర్దేశిస్తురదన్నారు. అయితే కొన్ని పార్టీలు తమ వల్లనే తెలంగాణ వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌ను ఆధునికనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. జాతీయ అంశాలను దృష్టిలో పెట్టకొని యూపీఏను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరబోతోందని ప్రధాని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతున్న సమయంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొన్నాం. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగం వధా కాలేదు. సోనియాగాంధీ సంకల్పం వల్లే తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణను తామే తెచ్చామని కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. తెలంగాణ తెచ్చింది.. ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే. తెలంగాణ కాంగ్రెస్‌ వల్లే వచ్చిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. అలాగే తెలంగాణ ప్రగతి కాంగ్రెస్‌తోనే సాధ్యం. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ తయారు కావాలి. దేశం గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్‌ పాలనలోనే హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తాం. తెలంగాణలో వచ్చే తొలి ప్రభుత్వం మీ భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని వివరించారు. వ్యవసాయాభివృద్ధి, రైతులను ఆదుకునేందుకు యూపీఏ రూపొందించిన పథకాలు మంచి ఫలితాలు సాధించినట్టు ఆయన చెప్పారు. భాజపా అడ్డుపడటం వల్లనే అనేక అవినీతి నిరోధక చట్టాలను అమల్లోకి తీసుకురాలేకపోయామని ఆరోపించారు. గత పదేళ్లకాలంలో దేశంలో పలురంగాల్లో అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించమన్నారు. యూపీఏ పాలనలో దేశవ్యాప్తంగా అమలుచేసిన మధ్యాహ్న భోజనపథకంతో దాదాపు 11 కోట్లమంది విద్యార్థులు బడిబాట పట్టారన్నారు. యూపీఏ పాలనలో దేశవ్యాప్తంగా పలు ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 2 లక్షల కి.మీ. రహదారులు నిర్మించినట్టు ఆయన వెల్లడించారు. గత పదేళ్ల యూపీఏ పాలనాకాలంలో ఎంతో అభివృద్ధిని సాధించామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. గ్రామీణ భారతంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వైద్య సౌకర్యాలుఏర్పాటుచేశామన్నారు. ఒక వ్యక్తి కేంద్రంగా భాజపా తన ప్రచారాన్ని సాగిస్తోంది. భాజపాది మనసులో ఒక మాట బయటకు చెబుతున్నది మరో మాటని ఆరోపించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి ఓటేస్తే దేశం అధోగతనన్నారు. బీజేపీ అంతరంగం వేరు.. బహిర్గతం చేసే అంశం వేరు. ఒక వ్యక్తి కేంద్రీకతంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. మోడీ చేసేవన్నీ ఆచరణ సాధ్యం కానీ హామీలే. బీజేపీ అసంబద్ధ హావిూలు గుప్పిస్తోందని దుయ్యబట్టారు. పదేళ్లలో అట్టడుగు వర్గాల వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాం. యూపీఏ హయాంలో గణనీయమైన అభివృద్ధిని సాధించాం. మా పాలనలో పేదరికాన్ని మూడొంతులు తగ్గించాం. 14 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించాం. దేశంలో వ్యవసాయాన్ని ఆదుకున్నది యూపీఏయేనే. దేశంలో విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. వ్యవసాయ అభివృద్ధి, రైతులను ఆదుకునే విషయంలో చేసిన ప్రయత్నాలన్నీ సఫలమయ్యాయి. ఆరోగ్య రక్షణ అనేది మా ప్రాధాన్యత అంశమని విరించారు. ప్రధాని ప్రసంగాన్ని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ తర్జుమా చేశారు. ఈ కార్యక్రమంలో దిగ్విజయ్‌ సింగ్‌, వాయిలార్‌ రవి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, జానారెడ్డి, కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని రాకతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.