తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు కేసీఆర్ సభలో లేడు
ఇది ఆయనకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి
మెదక్ ప్రజలు ఇందిరాగాంధీని ఆదరించారు
ఇప్పుడు కూడా దీవించండి
టీడీపీ, బీజేపీ అడుగడుగునా తెలంగాణను అడ్డుకున్నాయి
రాజ్యసభలో భాజపా అసలు స్వరూపం బయటపడింది
సామాజిక తెలంగాణాకు కట్టుబడ్డాం : సోనియాగాంధీ
చేవెళ్ల, ఏప్రిల్ 27 (జనంసాక్షి) :
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు ప్రత్యేక రాష్రా ్టన్ని తెచ్చానని చెప్తున్న కేసీఆర్ సభలోనే లేడని కాం గ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఇది ఆయనకు తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎ స్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీలకు సామాజిక న్యా యం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమ ని సోనియాగాంధీ పేర్కొన్నారు. ఈనెల 30న జరి గే సార్వత్రిక ఎన్నికల్లో చేతికి గుర్తుకు ఓటువేసి తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మెదక్ జిల్లా ఆందోల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పా ల్గొని ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలోగానీ ప్రజలకు సాంఘిక న్యాయం, సామాజిక భద్రత కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. సా మాజిక న్యాయం జరగాలంటే అట్టడుగు అభివృద్ధి చెందాలని, అందుకు వారికి భద్రత కల్పన ముఖ్య మన్నారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదని అందరూ భావించారని, కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి
కష్టనష్టాలను ఎదుర్కొని తెలంగాణ ఇచ్చామన్నారు. అందరిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఏర్పాటులో తమ బాధ్యత ఒక్కటే కాకుండా ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలు ఊరికే పోవని, వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌లో కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయని, ఒక ప్రాంతంలో పార్టీ నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరికలు వచ్చినా వాటిని లెక్కచేయకుండా రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు. ఇలాంటి తరుణంలో కొత్త రాష్ట్రంలో మొదటి ప్రభుత్వం ఏ పార్టీది ఉండాలో విజ్ఞులైన మీరు ఆలోచించాలని అన్నారు. తెలంగాణలో సాధనలో ఇక్కడి ప్రజలే అసలు నాయకులని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రూ.40వేల కోట్లతో బృహత్తర ప్రణాళికను రూపొందించామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, అభ్యున్నతి కోసం నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నామని అన్నారు. నదీ జలాల వినియోగం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు వికారాబాద్ నుంచి ఆధునీక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. వెనకబడిన ప్రాంతాల్లో పదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇస్తామని అన్నారు. దీంతో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే పన్నులు, సంపద తెలంగాణాకే చెందుతాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం టీ పీసీసీ మెరుగైన మేనిఫోస్టెను రూపొందించిందని అన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు వాటితో పనిలేదని, అభివృద్ధి, అభ్యున్నతిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని అన్నారు. వివిధ పార్టీలు మాటలు మార్చినా.. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చామని అన్నారు. సంప్రదాయం, ఛాందస శక్తుల ద్వారా ప్రమాదం పొంచిఉందని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు. అవకాశవాదం ఆ పార్టీ నైజమని, వారికి స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. కొందరు అధికారం దాహంతో, అభద్రతాభావంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ప్రజల ఓట్లు పొందాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. అధికార దాహంతో దురంహకారపూరితంగా మాట్లాడే వారిని చిత్తుగా ఓడించాలని అన్నారు. తెలంగాణలో శాంతి, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం లభించాలంటే కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని అన్నారు. ఉజ్వల భవిష్యత్ కోసం కాంగ్రెస్‌కు ఓటువేసి గెలిపించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నానని సోనియాగాంధీ అన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్నాయని తెలిపారు. తెలంగాణకు మద్దతిస్తున్నామంటూనే బీజేపీ అనేక కొర్రీలు పెట్టిందని అన్నారు. బీజేపీ అసలు స్వరూపమేంటో రాజ్యసభలో బయటపడిందని తెలిపారు. మెదక్ ప్రజలు ఇందిరాగాంధీని ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు పంపారని, ఇప్పుడు కూడా దీవించాలని ఆమె కోరారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్, నేత కార్మికుల కోసం టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.