కొంచెం నీరు.. కొంచెం నిప్పు

ఓఎంసీ కేసులో సబితకు ఉచ్చు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28
(జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు సబితా ఇం ద్రారెడ్డి, కేవీపీ రామచంద్రారావులకు కో ర్టుల నుంచి మిశ్రమ స్పందనలు ఎదుర య్యాయి. టైటానియం కేసులో ఇంటర ్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు అందుకున్న రాజ్యసభ సభ్యుడు కేవీపీకి హైకోర్టులో ఊ రట లభించగా, ఓబులాపురం మైనింగ్‌ కం పెనీ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమన్లు జారీ చేసింది. ఓఎం సీ కేసుల సబితాఇంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జూన్‌ 4వ తేదీన కోర్టుకు హా జరు కావాలని ఆదేశించారు. సబితతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కృపానం దంలపై వచ్చిన అభియో గాలను కోర్టు విచారణకు స్వీకరిం చింది. ఈ మేర కు సోమవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వారిద్దరికి నోటీసు లు జారీ చేసింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమా లపై విచారణ జరిపిన సీబీ ఐ ఇప్ప టకే పలు చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే, ఇటీవలే ఓఎంసీ కేసులో సబి త పేరు చే ర్చాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. భారీ పరిశ్రమల శాఖ మం త్రిగా సబిత ఓఎంసీకీ
ి అనుకూలంగా వ్యవ హరించారని పేర్కొంది. సబితతో కృపానందంపై వచ్చిన అభియోగాలను కోర్టు విచారణకు స్వీకరించింది. జూన్‌ 4న విచారణకు హాజరు కావాలని సబిత, కృపానందానికి సమన్లు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి కారుచౌకగా గనులు సంపాదించిన ఓఎంసీ.. సహజ వనరులను దోచుకుంది. రాష్ట్ర సరిహద్దులను చెరిపేసి మరీ మైనింగ్‌ చేపట్టింది. ఓఎంసీకి గనుల కేటాయింపుల వ్యవహారంలో తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని సీబీఐ ఇప్పటికే గుర్తించింది. క్యాబినెట్‌ నోట్‌లో ఉన్న క్యాప్టివ్‌ మైనింగ్‌ అన్న పదాన్ని ఓఎంసీకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యపూర్వకంగా తొలగించారని పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే నాటి భారి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించింది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు హైకోర్టులో ఊరట లభించింది. అమెరికాకు సంబంధించిన టైటానియం ఖనిజం కేటాయింపుల కేసులో ఇంప్లీడ్‌ కావాలని సీబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా వార్తల ద్వారానే మాకు రెడ్‌కార్నర్‌ నోటీసు విషయం తెలిసిందని, అయితే అమెరికా కోర్టు నుంచి ఇప్పటి వరకు తమకు నోటీసులు అందలేదని కేవీపీ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. అయితే రెడ్‌కార్నర్‌ నోటీసులు తమకు అందాయని, వారెంట్‌పై మాకు ఎలాంటి సమాచారం లేదని సీఐడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. కేవీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కేవీపీపై అమెరికా కోర్టు జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. వారెంట్‌ జారీ అయ్యాక తదుపరి ఆదేవాలు ఇచ్చేవరకు అతడి జోలికి వెళ్లవద్దని తెలిపింది.