సమరానికి సర్వం సిద్ధం

నేడు తెలంగాణలో పోలింగ్‌
119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌
స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనండి : భన్వర్‌లాల్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలకు స ర్వం సిద్ధమయింది. బుధవారం జరిగే ఎ న్నికలకు పది జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ తెచ్చామని చెబుతున్న పలు పార్టీలకు ఓటర్లు తీర్పును ఇవ్వబోతున్నారు. ఎవరి చేతిలో తెలంగాణ పెట్టాలో నిర్ణయించబోతున్నారు. పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పాటు పీసీసీ చీఫ్‌ పొన్నాల, మాజీ చీఫ్‌ డీఎస్‌, పలువురు మంత్రులు తమ ఎన్నికల అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దా మోదర రాజనర్సింహ, జానారెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తదితరులు కూడా ప్రస్తుత బరిలో ఉన్నారు. ఇక సీఎం కా వాలనుకుంటున్న వారిలో కాంగ్రెస్‌లోనే అధికంగా ఉన్నారు. వీరిలో పొన్నాల, డీ ఎస్‌, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఎన్నికల క్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలా గే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా తొలిసారిగా నిజామాబాద్‌ నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్‌. కృష్ణయ్య ఎల్‌బీ నగర్‌లో పోటీలో ఉన్నారు. ఎమ్మా ర్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ వర్దన్నపేట బరిలో ఉన్నారు. దీంతో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలకు స ర్వం సిద్ధమయింది. బుధవారం జరిగే ఎ న్నికలకు పది జిల్లాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ తెచ్చామని చెబుతున్న పలు పార్టీలకు ఓటర్లు తీర్పును ఇవ్వబోతున్నారు. ఎవరి చేతిలో తెలంగాణ పెట్టాలో నిర్ణయించబోతున్నారు. పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకో బోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో పాటు పీసీసీ చీఫ్‌ పొన్నాల, మాజీ చీఫ్‌ డీఎస్‌, పలువురు మంత్రులు తమ ఎన్నికల అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దా మోదర రాజనర్సింహ, జానారెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తదితరులు కూడా ప్రస్తుత బరిలో ఉన్నారు. ఇక సీఎం కా వాలనుకుంటున్న వారిలో కాంగ్రెస్‌లోనే అధికంగా ఉన్నారు. వీరిలో పొన్నాల, డీ ఎస్‌, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఎన్నికల క్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలా గే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా తొలిసారిగా నిజామాబాద్‌ నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్‌. కృష్ణయ్య ఎల్‌బీ నగర్‌లో పోటీలో ఉన్నారు. ఎమ్మా ర్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ వర్దన్నపేట బరిలో ఉన్నారు. దీంతో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారంతో ప్రచారం పరిసమాప్తం కాగా మంగళవారం అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అధికారులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఇవిఎంలను గట్టి బందోబస్తు మధ్య తరలించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బుధవారం ఏడో విడత ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో 4గంటలకే పోలింగ్‌ పూర్తి కానుంది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఒపినియన్‌ పోల్స్‌, ఎగ్జిట్‌పోల్స్‌ నిషేదం ఉంటుంది. ఎన్నికలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం వరకు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్‌ ఉంటాయి. మీడియాలో అభ్యర్థుల ఇంటర్వూలపై కూడా నిషేధం ఉంటుంది. ఇక తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. దీంతో పాటు ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. తెలంగాణ, బీహార్‌, గుజరాత్‌, జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, దాద్రానగర్‌ హవేలి, డయ్యూ డామన్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 1295 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 13.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. నరేంద్రమోడీ, సోనియాగాంధీ, అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, మురళీమనోహర్‌ జోషి తదితర హేమాహేమీలు రేపటి ఎన్నికల బరిలో ఉన్నారు. అలాగే తెలంగాణలో పలవురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షిచుకోబోతున్నారు. తెలంగాణలోని మొత్తం 119 శాసనసభ, 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి 2.82 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాల్లో 30,518 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు భన్వర్‌లాల్‌ వివరించారు. 16,512 పోలింగ్‌ు కేంద్రాలలోని ఎన్నికల పక్రియను అంతర్జాలం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. దీని కోసం మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో పెద్ద తెరలను ఏర్పాటు చేస్తామని, ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు వీటిపై వీక్షించవచ్చని తెలిపారు. ఇందులో 1200 పోలింగు కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆ మేరకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పది జిల్లాల్లోనూ 1.40 లక్షల మంది పోలీసు బలగాలను మోహరించారు. తెలంగాణలోని 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ సమయాన్ని ఇదివరకు ప్రకటించిన దానికన్నా మరో గంట పాటు పొడిగించినట్లు భన్వర్‌లాల్‌ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 10 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓటింగ్‌ జరుగుతుందని తొలుత ప్రకటించారు. అయితే, ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వీటి సంఖ్యను మూడుకు తగ్గించారు. మిగతా 7 స్థానాల పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. సాధారణ పరిస్థితులున్న 109 నియోజకవర్గాల పరిధిలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగుతుందని భన్వర్‌లాల్‌ వివరించారు. మవోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగును సాయంత్రం 4గంటలకే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అవి.. భూపాలప్లలె, ములుగు (వరంగల్‌ జిల్లా), భధ్రాచలం (ఖమ్మం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గాలు. సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్‌ జరిగే స్థానాలు : సిర్పూర్‌, చెన్నూరు, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ (ఆదిలాబాద్‌ జిల్లా), మంథని (కరీంనగర్‌ జిల్లా), అచ్చంపేట్‌, కొల్లాపూర్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా) ఉన్నాయి. పోలింగ్‌ను పురస్కరించుకుని ఆ రోజును జీతంతో కూడిన సెలవుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఐటీ పరిశ్రమకు కూడా సెలవు వర్తిస్తుంది. సెలవు ఇవ్వని పక్షంలో సంస్థ యాజమన్యానికి ఏడాది జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందని అన్నారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఈ ప్రాంతంలోని సగానికిపైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల పక్రియను ప్రజలు నేరుగా చూసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించనుంది. దీని కోసం ఇంటర్‌నెట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేయటంతో పాటు ప్రజల కోసం పెద్దపెద్ద తెరలనూ ఏర్పాటు చేయనున్నామని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఓటు వేసి వచ్చే ప్రజలను కానీ, నాయకులను గానీ ఓటు ఎవరికి వేశారనే విషయమై ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేయకూడదు. వాటిని ప్రసారం కూడా చేయకూడదని భన్వర్‌లాల్‌ తెలిపారు. దీనిని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన అంశాలనూ టీవీల్లో ప్రసారం చేయకూడని తెలిపారు. రాజధాని హైదరాబాద్‌ మహానగర పరిధిలోకి వచ్చే 5 పార్లమెంటు, 24 అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఐపీఎస్‌ అధికారి నుంచి ¬ంగార్డు వరకు మొత్తం 32వేల మంది పోలీస్‌ సిబ్బంది, పారా మిలిటరీ బలగాలు పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలు, అసాంఘిక శక్తుల విధ్వంస వ్యూహాలపై సమాచారం అందిన నేపథ్యంలో అసాధారణ రీతిలో పారామిలిటరీ బలగాలను మోహరించారు.తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారాలను టీవీ ఛానెళ్లు ప్రసారం చేయకూడదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం 6గంటల తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారాలను ప్రసారం చేసేందుకు వీలుంటుంది.
భారీగా బలగాలు..
ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈవీఎంల పరిశీలన, పంపిణీ చేపట్టారు. సిబ్బంది, భద్రతా బలగాలు ఎన్నికల సామాగ్రి తీసుకొని పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరారు. మొత్తం 1.40 లక్షల మంది సిబ్బంది ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. సున్నిత, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. అనుమానం వచ్చిన వారిని ముందుగానే అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.
పంపకాలపై ఈసీ నిఘా
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపై ఈసీ నిఘా పెట్టింది. మద్యం, డబ్బు పంపిణీపై దృష్టి సారించింది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే ఈసీ.. మద్యం సరఫరా, డబ్బు తరలింపుపై కఠిన చర్యలు చేపట్టింది. భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది, ఇక ప్రచార పర్వం ముగియడంతో పంపకాలపై నిఘా పెట్టింది. ఇప్పటికే పరిశీలకులు, నిఘా సిబ్బందిని రంగంలోకి దించిన ఈసీ.. పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరు డబ్బు పంపిణీ చేసినా అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం అరెస్టులు జరిగాయి. డబ్బు పంపిణీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పంపకాలు చాలాచోట్ల యథావిధిగా సాగాయి.
పోలింగ్‌లో ఓటుహక్కు ఉన్నవారందరూ తప్పనిసరిగా తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ కోరారు. అసెంబ్లీ, పార్లమెంటుకు వేర్వేరుగా ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది ఓటు వేసేందుకు అనుగుణంగా సంస్థలు చర్యలు చేపట్టాలని, అత్యవసర విభాగాల్లో పనిచేసేవారూ ఓటు వేసేలా చూడాలని భన్వర్‌లాల్‌ సూచించారు. ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకోకుంటే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. 4 వేల మంది ప్లయింగ్‌ స్క్వాడ్‌తో ఈ రాత్రి తనిఖీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. భూపాలపల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, సిర్పూరు, చెన్నూరు, అసిఫాబాద్‌, ఖానాపూర్‌, మంథని, అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలవరకు, మిగిలిన 109 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్‌ జరుగుతుందని, పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్నవారందరూ ఓటు వేయవచ్చని ఆయన చెప్పారు. 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చన్నారు. ఎన్నికల సిబ్బంది అందరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని, పార్టీలకు అనుకూలంగా ఉండే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఇచ్చే తీర్పునకు సహకరించడమే ఎన్నికల సిబ్బంది విధి అని భన్వర్‌లాల్‌ చెప్పారు. గుర్తింపు కార్డు చూసిన తర్వాతే ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది. ఓటరు స్లిప్‌ లేకపోతే ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఓటేయ్యవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఉదయం కార్యాలయానికి వచ్చే సిబ్బందికి ఒక పూట సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది ఓటు వేసేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టి.. అత్యవసర విభాగాల్లో పనిచేసే వారూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఈసీ నిర్ధేశించింది. ఓటు హక్కు వినియోగించేలా చర్యలు చేపట్టని వారిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయని వెల్లడించింది.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వీరు తమకు కేటాయించిన స్థానాలకు వెళ్ళారు. బుధవారం జరిగే పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం విస్తత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఒకరోజు ముందుగానే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ వర్కర్లు, లెక్చరర్లు పెద్దసంఖ్యలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. రిటర్నింగ్‌ అధికారులు, ఆ పై స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేశారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తామని ఎన్నికల సంఘం హావిూ ఇచ్చింది. వారికి కావాల్సిన కనీస సదుపాయాలను కల్పించాలని, ఉద్యోగినులకు ఎలాంటి సమస్య రాకుండా ప్రత్యేకంగా స్నానాల గది, మరుగుదొడ్లను ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేవంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తొలుత ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆయా జిల్లాల కలెక్టర్ల సిఫారసు మేరకు సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. దీని వల్ల సురక్షితంగా మండల, నియోజకవర్గ కేంద్రాలకు చేరుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రతి కేంద్రంలో మొదట పార్లమెంటు స్థానానికి, తర్వాత అసెంబ్లీ స్థానానికి ఓటు వేసేటట్లుగా ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ మిషన్లను అమర్చారు. లోక్‌సభ ఈవీఎంలో తెలుపు, అసెంబ్లీ ఈవీఎంలో గులాబీ రంగు బ్యాలెట్‌ పేపరు ఉంచుతారు. వాటికి ఎదురుగా బటన్స్‌ ఏర్పాటు చేస్తారు. ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లను గుర్తించి, ఆ తర్వాత ఈవీఎం మిషన్‌ను ఆన్‌ చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకుగాను 265 మంది, 119 అసెంబ్లీస్థానాలకుగాను 1669 మంది పోటీ పడుతున్నారు. 1934 మంది భవితవ్యం తేల్చే ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ట్రాన్స్‌జెండర్లను థర్డ్‌ జెండర్‌గా ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో వీరి సంఖ్య 5,487గా లెక్క తేలింది. తెలంగాణ ఎన్నికల్లో 2,329 మంది థర్డ్‌ జెండర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కర్నూలులో ఓ థర్డ్‌జెండర్‌ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇదిలావుంటే హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం, ఎల్బీనగర్‌లోని ఇండోర్‌ స్టేడియం, అంబర్‌పేట మైదానం తదితర ప్రాంతాల్లో అధికారులు పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామగ్రిని అందజేశారు. పోలింగ్‌ సిబ్బంది పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆయా పంపిణీ కేంద్రాల వద్ద హడావుడి వాతావరణం నెలకొంది. పోలింగ్‌కు వరంగల్‌ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎనుమాముల మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంగళవారం ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పాటు పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సామగ్రితో పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరి వెళ్లారు. అయితే మార్కెట్‌ పక్కనే కేంద్రం కావడంతో ఎన్నికల సిబ్బందికి ప్రభుత్వ అధికారులు మిర్చి ఘాటును గట్టిగానే చూపించారు. మిర్చి ఘాటుకు తట్టుకోలేక ఎన్నికల సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. ఎన్నికల కోసం సిబ్బందికి వరంగల్‌ లోని ఎనుమాముల మార్కెట్‌ ను ఈవీఎంల పంపిణీ కేంద్రంగా ఎంపిక చేశారు. అయితే మిర్చి సీజన్‌ కావడంతో పెద్ద ఎత్తున పంట మార్కెట్‌ వచ్చింది. వ్యాపారవేత్తలు, రైతులు భారీగా మిర్చిని ఎనుమాముల మార్కెట్‌ లో నిల్వ చేశారు. మార్కెట్‌ చుట్టూ ఉన్న సవిూప ప్రాంతాలకు మిర్చి ఘాటు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అదే ప్రాంతాన్ని ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేసే కేంద్రంగా ఎంచుకోవడంతో గందరగోళం నెలకొంది. మిర్చి ఘాటు తట్టుకునేందుకు చేతి రుమాల్లు, కండువాలను సిబ్బంది వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఎన్నికల సిబ్బందితో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల అధికారులు సిబ్బందికి ఈవీఎంలతో పాటు పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సామగ్రితో పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరి వెళ్లారు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌లో ఈవీఎంల పంపిణీ విషయంలో వివాదం నెలకొంది. రిటర్నింగ్‌ అధికారి అవమానించేలా మాట్లాడారని ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు. రిటర్నింగ్‌ అధికారి వెంటనే క్షమాపణ చెప్పాలని సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు ఖమ్మం జిల్లా అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలింగ్‌ సిబ్బందితో హడావుడి వాతావరణం నెలకొంది. మంగళవారం ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పాటు పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సామగ్రితో పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరి వెళ్లారు. ఇలా అన్ని జిల్లా కేంద్రాల నుంచి సాయాంత్రానికల్ల ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. వారికి గట్టి బందోబస్తు కల్పించారు.