పోలింగ్ అధికారిని కాటేసిన పాము…

 మహబూబ్ నగర్:

మహబూబ్ నగర్  జిల్లా పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని కేశంపేట మండలం దేవుని గుడి తండాలో పోలింగ్ అధికారి హుసలయ్యను పాము కాటేసింది. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.