ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్
దాదాపు 80 శాతం ఓటింగ్ : భన్వర్‌లాల్
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తత
హైదరాబాద్, మే 7 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌లో చెదురుముదురు ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలు ము గిశాయి. కాబోయే సిఎం చంద్రబాబా లేక, జగన్‌మోహన్‌రెడ్డా అన్నది 16న తేలనుంది. టీడీపీ, వైకాపాల మధ్య జరిగిన ¬ రా¬రీ పోరులో సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఎవరు సీఎం కాబోతున్నారో ఓ తెలుసుకో వాలంటే 8 రోజులు ఆగాల్సిందే. చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 13 జిల్లాల్లో 80 శాతం వరకు పో లింగ్ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరం తదితర పది నియో జకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియ గా మిగిలిన 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆరుగంటలకు పోలింగ్ ముగిసింది. సీమాంధ్రలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈవీ ఎంలలో నిక్షిప్తమైంది. పలు చోట్ల టీడీపీ – వైసీపీ కార్యకర్తలకు మధ్య గొడవలు జరిగాయి. ఘర్షణలో పలువురికి తీవ్ర గాయా లయ్యాయి. పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సీమాం ధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 175 అసెంబ్లీ స్థా నాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యా హ్నం 3 గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల రిగ్గింగ్ జరిగిందని టీడీపీ, వైసీపీలు పరస్పరం ఈస ీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. విశాఖ జిల్లాలో పాడేరు మం డలం పలకజీడిలోని పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు దాడి చేశారు. రెండు ఈవీఎంలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. అక్క డే ఉన్న జీపును దగ్ధం చేశారు. సాయంత్రం ఆరుగంటల వరకు క్యూలైన్లో ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సాయం త్రం ఐదు గంటలవరకు సుమారుగా 71 శాతం పోలిం గ్ న మోదైనట్లు ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో సాయంత్రం ఐదు గంటలవరకు 71.09 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలవారీగా పోలింగ్ శాతం ఇ లా ఉంది. కృష్ణా- 71.71, గుంటూరు- 74, ప్రకాశం- 73. 5, నెల్లూరు- 69, కడప- 71, కర్నూలు- 69, అనంత పు రం-73, చిత్తూరు- 72.1, శ్రీకాకుళం- 72, విజయనగరం 70.71, విశాఖ- 67, తూర్పు గోదావరి- 72, పశ్చిమగోదా వరి- 69.09. అయితే 75 శాతంవరకు పోలింగ్ జరిగి ఉం టుందన్న సమాచారం వస్తోంది. పోలింగ్ సందర్భంగా సీమాంధ్రలోని పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు కొనసాగాయి. పలుచోట్ల ఇరువర్గాల దాడులతో సంఘట నాస్థ లాలు రక్తసిక్తమయ్యాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ గా చోటుచేసుకున్నా యి. జిల్లాలోని ప్రతి గ్రమాంలో సీమ ఫ్యా క్షనిస్టు మార్కు కని పిం చింది. టీడీపీ, వైసీపీకి చెందిన కా ర్యకర్తలు ఒ కరిపై ఒకరు దాడుల కు పా ల్పడ్డారు. రాళ్లు,కర్రలతో దాడులు చే సుకోవడంతో పలువు రికి తీవ్రగాయాల య్యాయి. జమ్ము లమ డుగు మండలం దేవ గుడి గ్రామంలో ఎన్ని కల
విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఏఎస్పీ వాహనాన్ని ధ్వంసం చేశారు. గంటూరు జిల్లాలో ఓటు వేయడానికి వచ్చిన టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు వాహనంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.రాజంపేట మండలం రోళ్లమడుగు పంచాయతీలోని బాలరాజు పల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు దాడి చేసుకున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని దుమ్ములపేట గ్రామంలో 600 ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలోని 5 గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. తమ గ్రామాలను ఐటీడీఎ పరిధిలోకి తేనందుకు ఓటుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయా గ్రామాల ఓటర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. విశాఖ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కొయ్యూరు అటవీ ప్రాంతంలోని పలకజీడి పోలింగ్ కేంద్రంపై దాడి చేశారు. ఈవీఎంలను పగులగొట్టారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. పలుచోట్ల పోలీసులపై దాడి, కొన్ని చోట్ల విూడియాపై దౌర్జన్యం, మరిన్ని చోట్ల ఇరువర్గాల ఘర్షణ చోటు చేసుకున్నాయి. పోలింగ్ వివరాలను ఇసి అధికారికంగా ప్రకటిస్తుంది.
సార్వత్రిక ఎన్నికలను అడ్డుకొనేందుకు నక్సల్స్ యత్తిస్నారని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికిని మరోసారి చాటుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో మెరుపుదాడి చేశారు. కొయ్యూరు మండలం పలకజీడి ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రంపై మావోలు దాడి చేశారు. అక్కడే ఉన్న ఓ పోలీసు జీపును దహనం చేశారు. రెండు ఈవీఎంలను ఎత్తుకెళ్లి వాటిని తగులబెట్టారు. ఈ ఘటనలో 35 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ముందే పిలుపునిచ్చారు. అయితే, పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు మావోలు ఈవీఎంలు ఎత్తుకెళ్లారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడం, పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినప్పటికీ మావోలు తమ ప్రాబల్యం చాటడం గమనార్హం. కాగా, ఈవీఎంలను మావోయిస్టులు ఎత్తుకుపోవడంతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈవీఎంలను దహనం చేయడంతో అక్కడ రీపోలింగ్‌కు ఆదేశిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. మావోయిస్టులు ఈవీఎంలను ఎత్తుకెళ్లిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చామన్నారు.