మాజీలైనా సర్కారీ బంగళాల్లోనే…

న్యూఢిల్లీ: ప్రభుత్వ నివాస భవనాలలో అక్రమంగా తిష్టవేయడంపై సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు విధించినప్పటికీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పనిచేసిన 22 మంది మాజీ మంత్రులు మాత్రం దేశ రాజధానిలోని ఆ విశాలమైన  బంగళాలలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. అలా ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్న వారిలో మాజీ కేంద్ర మంత్రులు ఎస్ఎం కృష్ణ, ఎ రాజా, దయానిధి మారన్ కూడా ఉన్నారు.సుభాష్ చంద్ర అగర్వాల్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ప్రకారం దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అందచేసిన వివరాల ప్రకారం కేంద్ర మాజీ మంత్రులు పికె బన్సల్, దినేశ్ త్రివేది, ముకుల్ రాయ్, విన్సెంట్ హెచ్ పాలా, పళణిమాణిక్యం, ఎస్ జగద్రక్షకన్, ఎస్ గాంధీసెల్వన్, హరీశ్ రావత్, సిపి జోషి తదితరులు ప్రభుత్వ బంగళాలను ఆక్రమించుకుని ఉన్నారు.