యూపీఏకే జై
తెలంగాణలో మేము, ఆంధ్రలో జగన్
ప్రధానిగా రాహుల్‌కు మా మద్దతు
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌పై కృతజ్ఞత ఉంది
టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
హైదరాబాద్, మే 9 (జనంసాక్షి) :
కేంద్రంలో యూపీఏకే మద్దతిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఇక కేంద్రంలో యూపీఏ ప్రభు త్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే పక్షంలో టీ ఆర్‌ఎస్ మద్దతు పలుకుతుందన్నారు. చంద్రబాబు రెంటికిచెడ్డ రేవడగా మార డం ఖాయమన్నారు. తెలంగాణలో కచ్చితంగా 60 సీట్లకు పైన గెలుస్తుంద న్నారు. అయితే అవి ఎంతగా ఉంటాయంటే 70 లేదా 80 లేదా 90 స్థానాల దాకా గెలుచుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కి 20 నుంచి 30 కి మించి స్థానాలు రావ న్నారు. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని, తాను తప్పకుండా మద్దతు ఇస్తానని కేసీఆర్ అన్నారు. సోనియా, రాహుల్‌ల వల్లనే తెలంగాణ వచ్చిందని, వారి పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు తమకు వారిపట్ల కృతజ్ఞత ఉందన్నారు. కేంద్రంలో యూపీఏ రాకపోతే అప్పుడు ప్రత్యామ్నాయం గురించి, మూడో కూటమి గురించి ఆలోచిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయేకి మద్దతిచ్చే ప్రశ్నే లేద న్నారు. సీమాంధ్రలో వందకు పైగా సీట్లు సాధించి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్ర భుత్వం ఏర్పాటు చేయబోతున్నారని కేసీఆర్ అన్నారు. తెలుగు జాతి ప్రయోజ నాల కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణలో ఏర్పడబోయేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, నూటికినూరు శాతం నిజమని రాసుకోండని కేసీ ఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 60 నుంచి 90 స్థానాలకు వరకు గెలుపొందుతాం. అంతకంటే ఎక్కువ గెలిస్తే అది వండర్. జంట నగరాల్లో కూడా టీఆర్‌ఎస్ అధిక స్థానాలు కైవసం చేసు కుంటుంది. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా,నల్లగొండ లో ఊ హించని ఫలితాలు వస్తాయి. ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ బోణి కొడుతోంది. ఒకటి లేదా రెండు సీట్లు గెల్చుకుంటామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మేము ఎవరిని సంప్రదించడం లేదు. టీఆర్‌ఎస్సే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్‌కు 30 లోపు స్థానాలు మాత్రమే వస్తాయి. పొన్నాల లక్ష్మయ్య పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పగటి కలలు కంటోంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావొద్దని కొందరు అనుకుంటున్నారన్నారు. మాకు క్యాంపులు పెట్టాల్సిన ఖర్మ లేదన్నారు. కొందరు పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నారని ఆంధ్రజ్యోతిపై మండిపడ్డారు. పొన్నాల 20 మంది టచ్‌లో ఉన్నారన్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇది దిగజారుడు రాజకీయమన్నారు. టీఆర్‌ఎస్ నిప్పులాంటి పార్టీ.. ముట్టుకుంటే దహించుకుపోతారని కేసీఆర్ అన్నారు. తుచ్ఛమైన పదవుల కోసం టీఆర్‌ఎస్ రాజకీయం చేయదు. 20 మంది టచ్‌లో ఉన్నారని పొన్నాల చెబుతున్నాడు.. ఆయన ఏమైనా బ్రోకరా? పొన్నాల రాజకీయం చేస్తున్నాడా వ్యభిచారం చేస్తున్నాడా? పొన్నాలది ఇంత దిగజారుడు రాజకీయమా? ఫలితాలు రాకముందే ఎందుకిన్ని కథలు. పొన్నాల లక్ష్మయ్య పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకో. కాం గ్రెస్ పగటి కలలు కంటోందని మండిపడ్డారు. ఇలా చేస్తే చీరిచింతకు కడతారని హెచ్చరించారు. ఇక సీమాంధ్రకు సీఎం జగనే అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సీమాంధ్రకు సీఎం అవుతారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాలేరు. వైసీపీ వంద స్థానాలకు పైగా విజయం సాధిస్తుంది. పక్క రాష్టాల్రతో ఎన్నో పనులుంటాయి. జగన్ ఏమైనా అంటరానివాడా ఆయన గురించి మాట్లాడితే తప్పేంటి? చంద్రబాబు భవిష్యత్‌లో కూడా సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు. ఆయన రెంటికీ చెడ్డ రేవడి కావడం ఖాయమన్నారు. ఇప్పటికే సింగపూర్ వెళ్లాడని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా మద్దతిస్తాం. సోనియా, రాహుల్ పట్ల నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది. సోనియాకు కతజ్ఞతతో ఉంటా. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్డీఏకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వం. అవసరమైతే కేంద్రంలో యూపీఏకు మద్దతిస్తామన్నారు. హైదరాబాద్‌పై మోడీ కుట్ర చేస్తున్నారని అన్నారు. తమ బాధ తెలంగాణ అని అన్నారు. వారికేం తెలుసు మా భాధ అంటూ మండిపడ్డారు. కొంతమందికి టీఆర్‌ఎస్‌కు రాకుంటే బాగుంటుందిని గులగుల పెడుతోందని ఎద్దేవా చేశారు. క్యాంపులు, పసెట్టాల్సిన ఖర్మ టిఆర్‌ఎస్‌కు లేదన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని, దీనిని ఎవరూ ఆపలేరన్నారు. అది అయిపోయింది. సమగ్రమైన, లోతైన పరిశీలన తరవాత ఫలితాల తరవాత కలుస్తానన్నారు. 16న సాయంత్రం ఇక్కడే తాను కలుస్తానని అన్నారు. ఫలితాలు వచ్చే సమయంలో సహనశీలత ఉండాలన్నారు. ఎన్నడూ లేనివిధంగా జంటనగరాల్లో కూడా సీట్లు సంపాదిస్తున్నాం. దక్షణ తెలంగాణలో కూడా మెజార్టీ రాబోతుందన్నారు. కొందరు దక్షిణ తెలంగాణలో సీట్లు రావని రాస్తున్నారు. ఇతర పార్టీలతో ఆధారపడకుండా, పూరన్తి మెజర్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తాము ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదన్నారు. ఆ అవసరం లేదన్నారు. ఇక తెలంగాణలో సిఎం ఎవరన్నది గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని అన్నారు. ఇక రెండు రాష్టాల్రతో కలసి తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం కలసి పనిచేయాల్సి ఉందన్నారు. ఇచ్చంపల్లి కట్టాలంటే అక్కడ ఛత్తీస్‌ఘడ్ రమణ్ సింగ్‌తో మాట్లాడాలి కదా. ఉద్యమం అయిపోయింది. టిఆర్‌ఎస్ రాజకీయంగా కొట్లాడినం. ఇక వివిధ పనుల కోసం పక్క రాష్టాల్రతో కలసి పనిచేయాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థలపై కౌంటింగ్ జాగ్రత్తలపై చర్చించామన్నారు. ఎక్కువ గెలుస్తామన్న ఆశ ఉందన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు ఎక్కువ సంఖ్యలో గెలుస్తామన్నారు. . మున్సిపల్ ఛైర్మన్, జడ్పీ ఎన్నికలపై అనుమానాలు ఉన్నాయన్నారు. జిల్లా అధ్యక్షులు, ముఖ్యులు సమన్వయం కోసం ఇన్‌ఛార్జిలుగా నియమించాం. పార్టీ కార్యాలయంలో సెల్ పెట్టి పరిశీలన చేస్తాం. మానిటర్ చేస్తాం. అని వెల్లడించారు. అపాయంటెడ్ డేట్‌పై ¬ం శాఖ కన్సిడర్ చేస్తోందన్నారు. డేట్ మార్చేది లేదని అన్నట్లు చెబుతున్నారు. అది నిజం కాదన్నారు. సచివాలయంలో జరుగుతన్నదంతా ప్రపోజల్స్. రెండు ప్రభుత్వాలు ఏర్పడితేనే అక్కడ పంపిణీలు జరుగుతాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డ తరవాతనే కలసి నిర్ణయిస్తాయి. ఇప్పుడు అన్నీ కూడా ప్రతిపాదనలు మాత్రమే. తెలుగు పత్రికలు అర్భకత్వాన్ని ప్రజల మీద రుద్దుతున్నాయి. సీమాంధ్రలో సీఎం చెట్ల కింద ప్రమాణం చేసి, పనిచేస్తామని చెప్పారు. అలాంటప్పుడు ఇక్కడ పంపిణీలు అన్నీ ప్రతిపాదనలు మాత్రమేనన్నారు. ఇలా పంచవద్దని గవర్నర్‌కు చెప్పాం. ఒక్కదగ్గర పెడితే ఉఏద్యోగులకు కొట్లాట జరుగుతుంది. అయినా పట్టించుకోకున్నా ఆయన ఇష్టం. వచ్చే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలే ముఖ్యమన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం యుద్దప్రతిపాదికన చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నర్ జిల్లాల్లో పర్యటించి రైతులను బాధలను అడిగి తెలుసుకుని నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని సమావేవంలో తీర్మానం చేశామన్నారు. రైతులను ఆదుకోవాలని, గవర్నర్ తెలంగాణలో గవర్నర్ పర్యటించాలన్నారు.