మళ్లీ డీజిల్‌ మంట


రూ.1.09 పైసలు పెంపు
ఈ అర్ధ నుంచే అమలు
న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి):
డీజిల్‌ ధరను లీటరుకు రూ. 1.09 పెంచుతున్నట్లు ప్రభుత్వ, చమురు రంగ సంస్థలు సోమవారం ప్రకటించాయి. పెరిగిన అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అండర్‌ రికవరీ లేదా నష్టాలను తగ్గించుకునే పాలసీకి తగ్గట్లుగా డీజిల్‌ ధర పెరిగింది. ఓఎంసీలు ఫిబ్రవరి 28న డీజిల్‌ ధరను లీటరుకు 50 పైసలు పెంచింది. ఎన్నికల ప్రక్రియ కారణంగా ఓఎంసీలు రెండు నెలలుగా ధరల సవరణకు డుమ్మా కొట్టాయి. ప్రతిపాదిత(ధర) మార్పును ఎన్నికల సంఘం ఆమోదించని కారణంగా ఓఎంసీలు రెండు పెంపుదలల ప్రభావాన్ని ఒకేసారి చూపాయి. దీనికి తోడు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ధరలు పెంచని కారణంగా స్వల్ప ప్రభావం పడింది. ఆ ప్రభావాన్ని డీజిల్‌ ధరపై చూపాల్సి వచ్చింది అని ఇండియన్‌ ఆయిల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.