మోడీకి మన్మోహన్ అభినందనలు.. రేపు రాజీనామా
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ప్రధాని మన్మోహన్ సింగ్ అభినందించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మన్మోహన్ సింగ్ తర్వాత దేశానికి 14వ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో తాను శనివారం నాడు రాజీనామా చేస్తానని మన్మోహన్ ప్రకటించారు.
ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యలయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. మందుగా జాతిని ఉద్దేశించి ప్రసంగించి, ఆ తర్వాత తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేస్తారు.