తెలంగాణలో గులాబీ గుబాళింపు


స్వతంత్రంగానే తెరాస
అధికారంలోకి..
నేడు టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం
శాసనసభ పక్షనేతగా కేసీఆర్‌

హైదరాబాద్‌, మే 16 (జనంసాక్షి) :తెలంగాణలో గులాబీ పార్టీ గుబాళించింది. దేశవ్యాప్తంగా సత్తా చా టిన మోడీ మంత్రం ఇక్కడ ఏమాత్రం పనిచేయలేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకొని స్పష్టమైన ఆధి క్యం ప్రదర్శించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థా నాల్లో 12 సీట్లు కైవసం చేసుకొంది. అలాగే, 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 63 సీట్లు సాధించి అధికార పీఠం దక్కించుకొంది. తెలంగాణ ఇచ్చిన కాం గ్రెస్‌ పార్టీ మాత్రం 21 స్థానాలకే పరిమితమైంది. టీడీ పీకి 15, బీజేపీకి 5 స్థానాలు, ఎంఐఎం ఏడు, సీపీఐ, సీపీఎం ఒక్కో చోట, వైఎస్సార్‌ సీపీ మూడు స్థానాల్లో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రచారంతో ¬రెత్తిం చిన కాంగ్రెస్‌ ఎక్కడ కూడా గట్టి పోటీనివ్వలేదు. చివరకు రెండో స్థా నం కోసం ఆ పార్టీ టీడీపీతో పోటీ పడాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ కు చెందిన ముఖ్య నేతలంతా ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ ఖ మ్మం, రంగారెడ్డి జిల్లాల్లో తన సత్తాచాటింది. వైఎస్సార్‌సీపీ ఖమ్మం జిల్లాలో గెలుపొంది.. తెలంగాణలో పాగా వేసింది. ఎంఐఎం, బీజేపీ హైదరా బాద్‌కు పరిమితమయ్యా యి. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు ఎదురే లే కుండా పోయింది. ఖ మ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోనూ ఆ పార్టీ బోణీ కొట్టింది. నిజామాబాద్‌ జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తొమ్మిదికి తొమ్మిది నియోజ కవర్గాలు కైవసం చేసుకుంది. కరీంనగర్‌లో 13 నియోజకవర్గాలకు గాను 12, వరంగల్‌లో 12 స్థానాల కు గాను 8 చోట్ల విజయం సాధించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను ఏడింట్లో టీఆర ్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. మహబూ బ్‌న గర్‌, నల్లగొండ జిల్లాల్లో సగానికి పైగా స్థానాలను సొంతం చేసుకుంది.
నిజామాబాద్‌లో క్లీన్‌స్వీప్‌..
నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 9 స్థానాలు గెలుచుకొని తన పట్టును నిలుపు కొంది. బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ, నిజా మాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ నియో జకవర్గాల్లో కారు ప్రభంజనం సృష్టించింది. జుక్కల్‌లో హన్మంత్‌ షిండే, ఎల్లారెడ్డిలో రవీందర్‌రెడ్డి, బాన్సువా డలో పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. నిజామాబాద్‌ రూరల్‌లో పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీని వాస్‌పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాల్కొండలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి మాజీ విప్‌ అనిల్‌పై గెలుపొందారు. ఆర్మూర్‌లో మాజీ స్పీకర్‌ సురే శ్‌రెడ్డి, బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కామా రెడ్డిలో షబ్బీర్‌ అలీ ఓటమి పాలయ్యారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు గెలుపొందిన మధు యాష్కీగౌడ్‌ మూడోసారి పోరులో ఓటమి పాలయ్యారు. కనీస పోటీ ఇవ్వడంలో ఆయన విఫలమయ్యారు. జిల్లాలో పటిష్టంగా ఉన్న టీడీపీ అడ్రస్‌ గల్లంతైంది. గత ఎన్నికల్లో 9 నియోజకవర్గాలకు గాను 5 చోట్ల గెలుపొందిన టీడీపీ.. ఈసారి ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. బీజేపీ పొత్తుతో ఆర్మూర్‌, బా ల్కొండ, ఎల్లారెడ్డిలలో విజయం సాధిస్తామని ధీమాలో ఉన్న పార్టీకి ఫలితాలు షాకిచ్చాయి. కారు జోరుకు కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు కాగా… సైకిల్‌ పంక్చరైంది.
ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ హవా..
మునిసిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 10 అసెం బ్లీ, 1 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం
చేసుకుంది. మంచిర్యాలలో దివాకర్‌రావు, ఆదిలాబాద్‌లో జోగు రామన్న, ఖానాపూర్‌లో రేఖానాయక్‌, ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, చెన్నూరులో నల్లాల ఓదెలు, ముధోల్‌లో విఠల్‌రెడ్డి, బోథ్‌లో రాథోడ్‌ బాపూరావు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రాకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఇద్దరు గెలుపొందడం విశేషం. నిర్మల్‌లో బీఎస్పీ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్‌లో కోనేరు కోనప్ప విజయం సాధించారు. బెల్లంపల్లిలో సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ ఓడిపోయారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గట్టి పోటీనివ్వకుండానే చతికిలపడింది.
కరీంనగర్‌లో కారు జోరు..
కరీంనగర్‌ జిల్లాలో కారు జోరు మరోమారు కొనసాగింది. పుర, స్థానిక పోరులో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌.. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయ కేతనం ఎగురవేసింది. కరీంనగర్‌లో రెండు లోక్‌సభ, 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలను సొంతం చేసుకుంది. ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌లకు ఓటమి తప్పలేదు. కోరుట్ల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి, కరీంనగర్‌, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానుకొండూరు, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. సిరిసిల్లలో 40 వేల ఓట్ల మెజార్టీతో కేటీఆర్‌, హుస్నాబాద్‌లో 12 వేల ఓట్ల మెజార్టీతో సతీష్‌కుమార్‌ గెలుపొందారు. మానుకొండూరులో 48 వేల ఓట్లతో రసమయి బాలకిషన్‌ విజయం సాధించారు. కోరుట్లలో 25085 మెజార్టీతో విద్యాసాగర్‌రావు, మంథనిలో పుట్ట మధు, హుజూరాబాద్‌లో ఈటెల, రామగుండంలో సోమారపు సత్యనారాయణ 2275 ఓట్ల ఆధిక్యంతో, వేములవాడలో చెన్నమనేని రమేశ్‌ 5400 గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట గెలిచింది. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పరాజయం పాలయ్యారు.
మెదక్‌లో విచ్చుకున్న గులాబీ
మెదక్‌ జిల్లాలో గులాబీ గుబాళించింది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీఆర్‌ఎస్‌ ఏడు స్థానాలను దక్కించుకొని ఆధిక్యం చాటుకుంది. సిద్దిపేట్‌, మెదక్‌, నారాయణఖేడ్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 19389 ఓట్లతో గజ్వెల్‌లో కేసీఆర్‌ విజయం సాధించారు. సిద్దిపేటలో 93 వేల పైచిలుకు మెజార్టీతో హరీశ్‌రావు విజయకేతనం ఎగురవేశారు. పటాన్‌చెరులో 18 వేల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి గెలుపొందారు. ఆందోల్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, నర్సాపూర్‌లో మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సంగారెడ్డిలో మాజీ విప్‌ జగ్గారెడ్డి, మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎంపీ విజయశాంతి ఘోరంగా ఓటమి పాలయ్యారు. జహీరాబాద్‌లో మాజీ మంత్రి గీతారెడ్డి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.
వరంగల్‌లో ‘కారు’ జోరు..
వరంగల్‌ జిల్లాలోనూ కారు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీఆర్‌ఎస్‌ మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటింది. 8 నియోజకవర్గాల్లో కారు దూసుకుపోయింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌, ములుగు, మంథని, భూపాలపల్లి, వర్ధన్నపేట, పరకాల, మహబూబాబాద్‌, వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించింది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ 40 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను మట్టి కరిపించారు. వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్‌ 86 వేల మెజార్టీతో గెలుపొందారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో 50 వేల పైచిలుకు మెజార్టీతో దాస్యం వినయ్‌భాస్కర్‌ విజయం సాధించారు. జనగామ నియోజకవర్గంలో పోటీ చేసిన టీపీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఓటమి పాలయ్యారు. డోర్నకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రెడ్యానాయక్‌, పాలకుర్తిలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధించారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన దొంతి మాధవరెడ్డి ఘన విజయం సాధించారు.
హైదరాబాద్‌లో కమల వికాసం..
రాజధానిలో బీజేపీ సత్తా చాటింది. అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, గోషామహల్‌లో ఆ పార్టీ పాగా వేసింది. ఖైరతాబాద్‌లో చింతల రామచంద్రారెడ్డి, ముషీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కె.లక్ష్మణ్‌, అంబర్‌పేట్‌లో కిషన్‌రెడ్డి, గోషామహల్‌ రాజాసింగ్‌ లోధా గెలుపొందారు. కంటోన్మెంట్‌, సనత్‌నగర్‌లలో టీడీపీ అభ్యర్థులు జి.సాయన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు. గోషామహల్‌లో ముఖేష్‌గౌడ్‌ 34 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌, సికింద్రాబాద్‌లో జయసుధ ఓటమి పాలయ్యారు. కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లిలో టీడీపీ విజయం సాధించింది. పాతబస్తీలో ఎంఐఎం పట్టు నిలుపుకొంది. మలక్‌పేట బలాల, బహదూర్‌పురా మోజంఖాన్‌, చార్మినార్‌ పాషాఖాద్రి గెలుపొందారు. యాకుత్‌పురా, నాంపల్లిలలోనూ మజ్లిస్‌ సత్తా చాటింది.
నల్లగొండలో టీఆర్‌ఎస్‌ హవా..
కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పట్టు సాధించి ప్రభంజనం సృష్టించింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ భారీ విజయం సాధించారు. ఇక మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. భువనగిరిలో పైలా శేఖర్‌రెడ్డి 15 వేల మెజార్టీతో, ఆలేరులో గొంగడి సునీత 30 వేల ఓట్లతో విజయం సాధించారు. హుజూర్‌నగర్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో ఆయన భార్య పద్మావతిరెడ్డి విజయం సాధించారు. నల్లగొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య ఓటమి పాలయ్యారు. తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌ కిశోర్‌, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి గెలుపొందారు. మిర్యాలగూడ, దేవరకొండ, భువనగురి, మునుగోడు, నకిరేకల్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగుతోంది.
రంగారెడ్డిలో ¬రా¬రి..
రంగారెడ్డి జిల్లాలో టీడీపీ సత్తా చాటింది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. పెద్దగా పట్టు లేని టీఆర్‌ఎస్‌ ఇక్కడ కూడా పాగా వేసింది. 3 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకొంది. పరిగి, పటాన్‌చెరు, తాండూరులలో ఆ పార్టీ విజయం సాధించింది. ఇక టీడీపీ అనూహ్య రీతిలో రంగారెడ్డిలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం విశేషం. మేడ్చల్‌, ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌, మహేశ్వరంలలో టీడీపీ గెలుపొందింది. దేవరకొండలో సీపీఐ అభ్యర్థి రవీంద్రనాయక్‌ గెలుపొందగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వేసింది.
మహబూబ్‌నగర్‌లో…
పాలమూరులో కారు దూసుకుపోయింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. 7 నియోజకవర్గాల్లో విజయం సాధించి టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. ఎన్నికలకు ముందుగా జిల్లాలో పెద్దగా పట్టు లేని కారు.. దూకుడు ప్రదర్శించి మంచి విజయాలు సొంతం చేసుకుంది. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, ఆలంపూర్‌, నాగర్‌కర్నూల్‌, షాద్‌నగర్‌, కొల్లాపూర్‌, అచ్చంపేటలలో టీఆర్‌ఎస్‌ ఆధిపత్యం కొనసాగించింది. కల్వకుర్తి, గద్వాల, వనపర్తిలలో కాంగ్రెస్‌, కొడంగల్‌, జడ్చర్లలో టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి.
ఖమ్మం జిల్లా
ఖమ్మం జిల్లాలో టీడీపీ మరోమారు తన ఆధిక్యతను ప్రదర్శించింది. జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఖాతా తెరిచింది. కొత్త గూడెంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ విజయం సాధించారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇల్లెందు, ఖమ్మం, పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించింది. సత్తుపల్లి, వైరా, పినపాకలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు.