మేనిఫెస్టో తూ.చ. అమలు చేస్తా


పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులెంతో
చంద్రబాబు గంతే
మొదటి కేబినెట్లోనే
కీలక నిర్ణయాలు
తీసుకుంటా : కేసీఆర్‌
హైదరాబాద్‌, మే 16 (జనంసాక్షి) :
ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంతో పాటు, మే నిఫెస్టో హామీలను అమలు చేస్తామని తెరాస అది óనేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలం గాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటా యన్నారు. తమకు మెజార్టీ
ఇచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరి అవసరం లేకుండా చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయమని, తెలంగాణ అమర వీరులకే గెలుపు అంకితమని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. శనివారం మధ్యాహ్నం తెరాస శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెరాస శాసనసభా పక్ష నాయకుడ్ని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాలతో తెరాసకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎలాంటి బేషజాలకు పోకుండా ప్రతిపక్షాల సంపూర్ణ సహకరాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. భవిష్యత్‌లో కూడా మీడియా, జర్నలిస్టుల సహకారం కావాలని కోరారు. భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, తెదేపా అధినేత చంద్రబాబుకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన కెసిఆర్‌కు కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. మెజార్టీ కట్టబెట్టినందుకు తెలంగాణ ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హావిూలను అన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు తెరాస పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్నారు. ఏకపక్షంగా గెలుపొంది, ప్రధాని కాబోతున్న మోడీకి, ఆంధప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకు అభినందనలు అన్నారు. సాధించుకున్న రాష్టాన్న్రి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని కోరారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నారు. తెలంగాణ అభివృద్ధి మాత్రమే పరమావధిగా తాము ముందుకు పోతామన్నారు. తెలంగాణలో మేజిక్‌ ఫిగర్‌ దాటడమే కాకుండా దాదాపు పన్నెండు మందు ఎంపీలను గెలుచుకుంటు న్నామన్నారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో మోడీ సహకారాన్ని తాను కోరుతున్నానని చెప్పారు. అమరవీరుల కుటుంబ సభ్యులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వ తొలి కేబినెట్‌ మీటింగ్‌లో అమరవీరులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల పైన కేసులు ఎత్తివేస్తామన్నారు. గతంలో జరిగిన నిర్ణయాలు ఆంధప్రదేశ్‌కు అనుకూలంగా జరిగాయని, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తాను అసెంబ్లీకి లేదా లోకసభకు రాజీనామా చేసే విషయం ఇప్పుడు కాదన్నారు. పేదలు వారి సంక్షేమం, వ్యవసాయం, యువతకు ఉద్యోగ అవకాశాల పైన తాము ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. దేశంలోనే అత్యాధునిక ఇండస్ట్రియల్‌ పార్క్‌ పెడతామన్నారు. చంద్రబాబు ఆంద్రా తెలంగాణ కోసం పని చేస్తారని, తాను తెలంగాణ కోసం పని చేస్తానని అన్నారు. తమకు సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, తమకు ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. పోలీసింగ్‌ వ్యవస్థను ఒక్కటిగా చేస్తామన్నారు. పోలీసు డిపార్టుమెంట్లలో ఎన్నో సంస్కరణలు చేయాల్సి ఉందన్నారు.
తెలంగాణ ప్రజలు తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి అధికారం కట్టబెట్టినందుకు కతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం పార్టీ మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామన్నారు. మోడీ ప్రధాని అయితే తెలంగాణ అభివద్దికి ఏమైనా ఆటంకమా? అని విలేకరులు ప్రశ్నించగా గుజరాత్‌ గత పదేళ్లలో మోడీ నాయకత్వలో అభివద్ధి చెందిందని, ఆ పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివద్ధికి ప్రతిబంధకం కాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియా పాత్ర ఇలాగే కొనసాగాలని టీఆర్‌ఎస్‌ అధినేత అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా విూడియా సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. విూడియా మిత్రులు సలహాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు. సంస్కారవంతంగా మెలగాలని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్‌ సూచించారు. బేషజాలకు పోవద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే అందరి ఆకాంక్ష కావాలని, దీనికి అందరికి సహకారం కావాలన్నారు. మంచి పద్ధతితో ముందుకు పోతామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు అమరవీరులను స్మరించుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ గులాబీ దళపతి కేసీఆర్‌ గన్‌పార్క్‌ వెళ్లి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. గన్‌పార్కుకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణవాదులు జైతెలంగాణ నినాదాలతో హెరెత్తించారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుతామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరిచిపోలేనివని కేసీఆర్‌ స్మరించుకున్నారు.